...
...
Next Story

Toxic Losses: పాపం యశ్.. ఆదిపురుష్ కంటే కూడా దారుణమైన డిజాస్టర్.. టాక్సిక్‌కు భారీ నష్టాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

Toxic Losses: కేజీఎఫ్ 2 తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తొలిరోజు రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లతో చారిత్రాత్మక ఓపెనింగ్స్ సాధించినా.. తీవ్రమైన నెగెటివ్ టాక్ వల్ల దారుణంగా పడిపోయింది.

Published on: Sep 10, 2026, 14:25:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Toxic Losses: ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఎదుర్కొన్న రూ. 220 కోట్ల నష్టం కంటే 'టాక్సిక్' రూ. 230 కోట్ల పైచిలుకు నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 500 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 339 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించగలిగింది. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన యశ్ కు ఇంతటి దారుణమైన పరాభవం ఎందుకు?

ఎందుకీ డిజాస్టర్.. అసలేం జరిగింది?

Toxic Losses: పాపం యశ్.. ఆదిపురుష్ కంటే కూడా దారుణమైన డిజాస్టర్.. టాక్సిక్‌కు భారీ నష్టాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?
Toxic Losses: పాపం యశ్.. ఆదిపురుష్ కంటే కూడా దారుణమైన డిజాస్టర్.. టాక్సిక్‌కు భారీ నష్టాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?

బాహుబలి, కేజీఎఫ్ తరహాలోనే యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' పై ఇండియన్ సినిమా చరిత్రలోనే ముందెన్నడూ లేనంత అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ఏకంగా నాలుగేళ్ల పాటు వేచి చూసి యశ్ చేసిన సినిమా కావడం, దర్శకురాలు గీతు మోహన్ దాస్ మేకింగ్, భారీ తారాగణం ఉండటంతో ఇది సునాయాసంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి.

కానీ బాక్సాఫీస్ ల్యాండింగ్ లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకోగా.. కనీసం రూ. 350 కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకోలేక సతమతమవుతోంది.

తొలిరోజు రికార్డు కలెక్షన్లు... మరుసటి రోజే ఘోర పతనం

విడుదలైన తొలిరోజు బాక్సాఫీస్ వద్ద 'టాక్సిక్' రికార్డుల సునామీ సృష్టించింది. ఇండియాలోనే ఏకంగా రూ. 101 కోట్ల నెట్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 145 కోట్ల గ్రాస్ వసూలు చేసి కన్నడ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. 2026లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది.

రెండో వారంలో నార్త్ లో 'హనుమాన్ అంశ్' మంచి టాక్ తెచ్చుకోవడంతో 'టాక్సిక్' థియేటర్లను వేగంగా కోల్పోయింది. దానికి తోడు 'మీర్జాపూర్ ది మూవీ' థియేటర్లలోకి రావడం 'టాక్సిక్' కలెక్షన్లను మరింత దెబ్బతీసింది. 15వ రోజు నాటికి ఇండియా అంతటా 'టాక్సిక్' కేవలం రూ. 60 లక్షల నెట్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ రోజువారీ గ్రాస్ రూ. 1 కోటి కంటే కిందకు పడిపోయింది. రెండు వారాల క్రితం రోజుకు రూ. 150 కోట్లు తాకిన సినిమాకు ఇది ఊహించని ఘోర పతనం.

ఆదిపురుష్ కంటే పెద్ద ఫ్లాప్? ట్రేడ్ లెక్కల విశ్లేషణ

ప్రస్తుతం ఉన్న ట్రేడ్ నివేదికల ప్రకారం 'టాక్సిక్' ఇప్పటివరకు ఇండియాలో రూ. 247 కోట్ల నెట్, ఓవర్సీస్‌లో 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 339 కోట్లు కాగా, గ్లోబల్ నెట్ వసూళ్లు రూ. 270 కోట్ల వద్ద ఆగిపోయాయి. చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమాలకు ఇవి గొప్ప సంఖ్యలే కావచ్చు.. కానీ రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య బడ్జెట్ తో నిర్మించినట్లు చెప్తున్న 'టాక్సిక్' మూవీకి ఇవి దారుణమైన గణాంకాలు.

కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ అని లెక్కలేసుకున్నా, థియేట్రికల్ రికవరీలో 'టాక్సిక్' దాదాపు రూ. 230 కోట్ల భారీ లోటులో కూరుకుపోయింది. గతంలో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం రూ. 550 కోట్ల బడ్జెట్‌తో రూ. 330 కోట్ల నెట్ సాధించి రూ. 220 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమాగా 'ఆదిపురుష్' ఉండగా, ఇప్పుడు 'టాక్సిక్' దాదాపు రూ. 230 కోట్ల లోటుతో ఆదిపురుష్ రికార్డును సైతం దాటి బాక్సాఫీస్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

స్టార్ కాస్టింగ్ ఉన్నా దక్కని ఉపశమనం

గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా వంటి అగ్ర కథానాయికలు నటించారు. సెన్సార్ బోర్డ్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా 'A' సర్టిఫికేషన్ పొందినప్పటికీ, బలమైన కథనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks