Toxic Record: నెగెటివ్ టాక్.. అయినా తగ్గేదేలే.. టాక్సిక్ రికార్డు.. ధురంధర్ 2ను మించి.. ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా!
Toxic Record: మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ థియేటర్లకు వచ్చేసింది. ఇవాళ ఈ సినిమా రిలీజైంది. యశ్ హీరోగా నటించిన ఈ మూవీపై నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు టాక్సిక్ సరికొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ 2ను దాటేసింది.
Toxic Record: 'కేజీఎఫ్ 2' తర్వాత నాలుగేళ్లకు ‘టాక్సిక్’ మూవీతో థియేటర్లకు వచ్చాడు రాకింగ్ స్టార్ యశ్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ రివేంజ్ డ్రామా పాన్-ఇండియా స్థాయిలో ఇవాళ (ఆగస్టు 25) విడుదలయ్యింది. అయితే మూవీకి ప్రీమియర్ షో నుంచి కూడా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ రికార్డుల్లో మాత్రం తగ్గేదేలేదన్నట్లు దూసుకెళ్తోంది.

టాక్సిక్ రికార్డు
ఇండియన్ సినిమా హిస్టరీలో టాక్సిక్ ఓ కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో యశ్ సినిమా అదరగొట్టింది. ఈ మూవీ ప్రీ సేల్స్ లో ఏకంగా 16 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ధురంధర్ 2 (14 లక్షలు) రికార్డును టాక్సిక్ బ్రేక్ చేసింది. ఈ రేంజ్ ప్రీ సేల్స్ తో టాక్సిక్ ఫస్ట్ డేనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం లాంఛనమే.
అడ్వాన్స్ బుకింగ్స్
'టాక్సిక్' అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఆగస్టు 21 శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యాయి. నేషనల్ సినిమా చైన్‌లు బుకింగ్స్ తెరవగానే ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ వేదికలన్నీ విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. బుధవారం ఉదయానికి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ఏకంగా 16 లక్షలకు పైగా టికెట్లను విక్రయించి, కేవలం ముందస్తు బుకింగ్స్ రూపంలోనే దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
హిందీ వర్షన్
మొదటి రెండు రోజులు కన్నడ వర్షన్ బుకింగ్స్ ముందంజలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత హిందీ డబ్బింగ్ వర్షన్ పరిశ్రమ అంచనాలను మించి దూసుకెళ్లింది. కేవలం హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.25 కోట్లు రావడం విశేషం. కన్నడ వర్షన్ రూ.18 కోట్లు రాబట్టినప్పటికీ, అక్కడ థియేటర్ల ఆక్యుపెన్సీ ఎక్కువగా నమోదైంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఉత్తరాదిన యశ్ సంపాదించుకున్న క్రేజ్‌కు ఈ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ ఓపెనింగ్స్ ఖాయం
భారతదేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 'టాక్సిక్' తొలిరోజే రూ.85 నుంచి రూ.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో హిందీ వర్షన్ రూ.35 నుంచి 40 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలవనుండగా, కన్నడ వర్షన్ కూడా దాదాపు అదే స్థాయిలో రాబట్టనుంది.
ఇక తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు కలిసి మరో రూ.12 నుంచి 15 కోట్లు రాబట్టనుననాయి. ఇండియా నెట్ వసూళ్లు ఏకంగా రూ.100 కోట్ల మార్కును తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు.
ఓవర్సీస్ లో ఇలా
విదేశాల్లో ముఖ్యంగా నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో టాక్సిక్ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో తొలిరోజే 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనితో 'టాక్సిక్' ప్రపంచవ్యాప్త తొలిరోజు గ్రాస్ వసూళ్లు రూ.120 నుంచి రూ.130 కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే 12వ అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'టాక్సిక్' నిలుస్తుంది.
గతంలో వచ్చిన 'యానిమల్' (రూ.116 కోట్లు), 'ఆదిపురుష్' (రూ.127 కోట్లు), 'జవాన్' (రూ.129 కోట్లు) చిత్రాల రికార్డులను టాక్సిక్ బ్రేక్ చేయనుందని చెప్పొచ్చు. అయితే యశ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' (రూ.164 కోట్లు) రికార్డును టాక్సిక్ అందుకునే సూచనలు కనిపించడం లేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


