...
...
Next Story

యశ్ టాక్సిక్ రిలీజ్ చెప్పిన సమయానికే.. వాయిదాలేమీ లేవు.. మరో 140 రోజుల్లో.. ప్రొడ్యూసర్స్ క్లారిటీతో ఫ్యాన్స్ ఖుష్

కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ టాక్సిక్ ది మూవీ. ఈ సినిమా రిలీజ్ వాయిదా తప్పదని వస్తున్న పుకార్లను ప్రొడ్యూసర్లు ఖండించారు. మరో 140 రోజుల్లో అంటూ వాళ్లు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Oct 30, 2025, 15:09:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

యశ్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ టాక్సిక్ ది మూవీపై తలెత్తుతున్న సందేహాలపై ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ గురువారం (అక్టోబర్ 30) ఓ ట్వీట్ లో ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19నే రిలీజ్ కానుందని స్పష్టం చేసింది. అటు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసింది.

టాక్సిక్.. ఆ రోజే రిలీజ్

యశ్ టాక్సిక్ రిలీజ్ చెప్పిన సమయానికే.. వాయిదాలేమీ లేవు.. మరో 140 రోజుల్లో.. ప్రొడ్యూసర్స్ క్లారిటీతో ఫ్యాన్స్ ఖుష్
యశ్ టాక్సిక్ రిలీజ్ చెప్పిన సమయానికే.. వాయిదాలేమీ లేవు.. మరో 140 రోజుల్లో.. ప్రొడ్యూసర్స్ క్లారిటీతో ఫ్యాన్స్ ఖుష్

కేజీఎఫ్ తో కన్నడ సూపర్ స్టార్ అయిన యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలుసు కదా. ఈ మూవీ తర్వాత అతడు నటించే తర్వాతి సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. అతడు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించినా.. వాయిదా తప్పదన్న పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా మరోసారి ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ స్పందించింది.

“మరో 140 రోజుల్లో.. ఎటు చూసినా కనిపించే అతడి ఉనికి.. మీ అస్తిత్వానికి ప్రమాదం. టాక్సిక్ ద మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. నిజానికి ఈ నిర్మాణ సంస్థ అప్పటికే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఈ విషయం తెలిసిందే.

పుకార్లు ఆపండి: తరణ్ ఆదర్శ్

అంతకుముందు గురువారం (అక్టోబర్ 30) ఉదయం ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేశాడు. తాను ప్రొడ్యూసర్లతో మాట్లాడానని, సినిమా చెప్పిన సమయానికి వస్తుందని అతడు స్పష్టం చేశాడు. “పుకార్లు ఆపండి.. యశ్ నటిస్తున్న టాక్సిక్ వాయిదా లేదా ఆలస్యం కావడం లేదు. మార్చి 19, 2026న రిలీజ్ ఖాయం. ప్రొడ్యూసర్లతో మాట్లాడాను. టాక్సిక్ ట్రాక్ లోనే ఉంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ వీకెండ్ అయిన మార్చి 19, 2026నే రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe