Zee Telugu: జీ తెలుగులో వీకెండ్ ధమాకా.. బుట్టబొమ్మ, మాస్ డైరెక్టర్ హంగామా.. కుటుంబ అవార్డులు కూడా..

Zee Telugu: ప్రముఖ తెలుగు వినోద ఛానెల్ 'జీ తెలుగు' (Zee Telugu) ఈ వీకెండ్ లో బుల్లితెర, వెండితెర తారల కోలాహలంతో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కాంబోతో సిద్ధమైంది. అక్టోబర్ 31 (శనివారం) సాయంత్రం 5 గంటలకు మోస్ట్ అవేటెడ్ 'జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2026 పార్ట్-1' ప్రసారం కానుంది.

Published on: Oct 30, 2026, 14:55:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Zee Telugu: బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సీరియల్ తారల ప్రతిభను గుర్తించడమే కాకుండా, వెండితెర సెలబ్రిటీల అంతరంగాలను ఆవిష్కరించేందుకు ప్రముఖ వినోద ఛానెల్ ‘జీ తెలుగు’ ఈ వీకెండ్ ను గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో ప్లాన్ చేసింది. ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలతో పాటు, అగ్ర దర్శకుడు, హీరోయిన్‌లతో కూడిన టాక్ షోతో ఈ శని, ఆదివారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Zee Telugu: జీ తెలుగులో వీకెండ్ ధమాకా.. బుట్టబొమ్మ, మాస్ డైరెక్టర్ హంగామా.. కుటుంబ అవార్డులు కూడా..
Zee Telugu: జీ తెలుగులో వీకెండ్ ధమాకా.. బుట్టబొమ్మ, మాస్ డైరెక్టర్ హంగామా.. కుటుంబ అవార్డులు కూడా..

అక్టోబర్ 31న జీ తెలుగు కుటుంబ అవార్డ్స్, నవంబర్ 1న రాత్రి 7:30 గంటలకు వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా చేసే 'జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2' లో 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ సందడి చేయనున్నారు. ఈ ఎంటర్‌టైన్మెంట్ హంగామాకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార సమయాలు మీకోసం.

జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2026 పార్ట్-1

టీవీ ఆడియెన్స్ ను ప్రతీరోజూ అలరించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ ఈవెంట్ 'జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2026' (Zee Telugu Kutumbam Awards 2026). ప్రసిద్ధ యాంకర్లు సుధీర్ (Sudheer), రవి (Ravi)ల ఎనర్జిటిక్ హోస్టింగ్‌లో రూపుదిద్దుకున్న ఈ అవార్డుల వేడుక పార్ట్-1 అక్టోబర్ 31 (శనివారం) సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది.

ఈ వేడుకలో 'బంగారు కుటుంబం', 'లవ్ బర్డ్స్ ఆఫ్ జీ తెలుగు', 'ఉత్తమ భార్యాభర్తలు', 'డ్రీమ్ కపుల్', 'ఉత్తమ సీరియల్', 'ఆరంభం ఒక అడుగుతోనే' వంటి వివిధ విభాగాల్లో పురస్కారాలను అందజేయనున్నారు. అలాగే ఉత్తమ యాంకర్, ఉత్తమ కథానాయకి, జయం మనదేరా, ఉత్తమ ప్రతినాయకి సీనియర్ కేటగిరీలలో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డులు ప్రధానం చేయనున్నారు.

ఈ అట్టహాసమైన వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు అనీల్ రావిపూడి, వి.వి. వినాయక్, హీరోయిన్ కేథరిన్ థ్రెసా, కమెడియన్ అలీ, ప్రముఖ గాయకుడు మనో ప్రత్యేక అతిథులుగా హాజరై అవార్డులను అందజేశారు. అలాగే 'కాస్ట్' చిత్రబృందం, క్రేజీ ఆన్‌స్క్రీన్ జోడీ మౌళి-శివానిల ప్రత్యేక పెర్ఫార్మెన్సెస్ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

'జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2': నవంబర్ 1 రాత్రి 7:30 గంటలకు

ఆదివారం సాయంత్రం వీక్షకులకు మరో సరికొత్త అనుభూతిని అందించేందుకు 'జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2' (Jayammu Nischayammu Raa Season 2) సిద్ధమైంది. వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షోలో ఈ వారం టాలీవుడ్ 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే, మాస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'దువ్వాడ జగన్నాథం' (DJ) నాటి షూటింగ్ విశేషాలను, మధుర జ్ఞాపకాలను ఈ షోలో వీరు పంచుకున్నారు. సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, ఆన్-సెట్ ఫన్, వ్యక్తిగత విశేషాలపై జగపతి బాబుతో వీరు జరిపిన సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనుంది.

ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు 'జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2026' పార్ట్-1, ఆదివారం రాత్రి 7:30 గంటలకు 'జయమ్ము నిశ్చయమ్ము రా సీజన్ 2' లను మిస్ కాకుండా చూడండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More