OTT Horror: ఓటీటీ ఛాలెంజ్.. ఈ 3 తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలను ఒంటరిగా చూసే దమ్ముందా? ఈ ఓటీటీలో ఫ్రీగా చూసే ఛాన్స్
OTT Horror: ఓటీటీలో మంచి హారర్ సినిమాల కోసం చూస్తున్నారా? అయితే మీకోసం జీ5 ఓటీటీ ఓ ఆఫర్ ఇచ్చింది. మూడు తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలను ఫ్రీగా ఈ ప్లాట్‌ఫామ్ లో చూడొచ్చు. అంతేకాదు ధైర్యం ఉంటే ఒంటరిగా చూడండి అంటూ ఓ ఛాలెంజ్ కూడా విసిరింది.
OTT Horror: ఓటీటీ ప్రియులకు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) మైండ్ బ్లాకింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది. వెన్నులో వణుకు పుట్టేలా భయపెట్టే మూడు సాలిడ్ తెలుగు హారర్ థ్రిల్లర్స్ ను రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. సౌందర్య 'చంద్రముఖి', కార్తి 'కాష్మోరా'తో పాటు క్లాసిక్ హారర్ డ్రామా 'తులసీదళం' సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తూ హర్రర్ లవర్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ధైర్యం ఉంటే చూడండి
ధైర్యం ఉంటే ఈ మూడు సినిమాలు ఒంటరిగా చూడండి అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ తన ఎక్స్ లో ట్వీట్ చేసింది. వీటిలో దివంగత నటి సౌందర్య ఐకానిక్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన 'చంద్రముఖి' (ఆప్తమిత్ర) హారర్ జానర్ లోనే బిగ్గెస్ట్ క్లాసిక్. స్ప్లిట్ పర్సనాలిటీ, దెయ్యం పట్టిన మానసిక పరిస్థితిని సౌందర్య స్క్రీన్ పై పండించిన తీరు ఇప్పటికీ ఆడియన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రాత్రి పూట ఒంటరిగా ఈ సినిమా చూస్తే భయంతో ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం.
ఇక తమిళ హీరో కార్తి నటనతో మెప్పించిన 'కాష్మోరా' ఒక విజువల్, హారర్ ఫీస్ట్. రాజ్ నాయక్ క్యారెక్టర్ లో కార్తి చూపించిన విలనిజం, బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్, ఆత్మల రివేంజ్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి. ఇందులో నయనతార, శ్రీదివ్య పర్ఫార్మెన్స్ తో పాటు సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
క్షుద్రపూజలు, చేతబడి కాన్సెప్ట్..
లెజెండరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పాపులర్ హారర్ నవల్ ఆధారంగా తెరకెక్కిన 'తులసీదళం' మూవీ టాలీవుడ్ లో ఒక మైలురాయి. చేతబడి, క్షుద్రపూజలు, ఆత్మల ప్రపంచం చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అప్పట్లోనే కల్ట్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ డిజిటల్ స్పేస్ లో మోస్ట్ డిమాండింగ్ కంటెంట్ గా ఉంది.
ఈ మూడు సినిమాలను చూడటానికి ఎలాంటి జీ5 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అవసరం లేదు. 'ఫ్రీ5' (Free5) క్యాంపెయిన్ లో భాగంగా హారర్ ఫ్యాన్స్ కోసం వీటిని ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీ5 టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
వీకెండ్ హారర్ బింజ్ వాచ్ కోసం బెస్ట్ ఆప్షన్
ఓటీటీలో రెగ్యులర్ గా లవ్, యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వ్యూవర్స్ కి ఈ హారర్ వాచ్‌లిస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి లేదా అర్ధరాత్రి ఒంటరిగా చూస్తూ థ్రిల్ అవ్వడానికి ఈ మూవీస్ పర్ఫెక్ట్ ఛాయిస్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జీ5 చేసిన పోస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ధైర్యం ఉంటేనే ఈ 3 సినిమాలు ఒంటరిగా చూడండి" అంటూ జీ5 ఇచ్చిన ఛాలెంజ్ తో నెటిజన్లు కూడా ఈ సినిమాలను బింజ్ వాచ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ మూడు సినిమాలతోపాటు నాగబాబు నటించిన వెబ్ సిరీస్ మేము కాప్‌లం వెబ్ సిరీస్ ను కూడా ఫ్రీగా చూసే వీలు కల్పించిందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


