Paper Leaks: పేపర్ లీక్స్‌పై అదిరిపోయే వెబ్ సిరీస్.. ది స్కామ్ లీక్డ్ టీజర్ రిలీజ్.. జీ5 ఓటీటీ సంచలనం

Paper Leaks: పేపర్ లీక్స్ పై దేశం నిరసనలతో దద్దరిల్లుతున్న వేళ జీ5 ఓటీటీ ఓ అదిరిపోయే వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ది స్కామ్ లీక్డ్ పేరుతో పేపర్ లీక్స్ పై ఈ సిరీస్ రాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.

Published on: Jul 22, 2026, 19:12:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Paper Leaks: దేశవ్యాప్తంగా నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మంటలు రేపుతున్న వేళ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) అత్యంత వివాదాస్పదమైన, సంచలనాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చింది. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజ్, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంతో తెరకెక్కుతున్న 'ది స్కామ్ – లీక్డ్' (The Scam – Leaked) వెబ్ సిరీస్ టీజర్‌ను బుధవారం (జులై 22) జీ5 అఫీషియల్‌గా రిలీజ్ చేసి దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది.

Paper Leaks: పేపర్ లీక్స్‌పై అదిరిపోయే వెబ్ సిరీస్.. ది స్కామ్ లీక్డ్ టీజర్ రిలీజ్.. జీ5 ఓటీటీ సంచలనం
Paper Leaks: పేపర్ లీక్స్‌పై అదిరిపోయే వెబ్ సిరీస్.. ది స్కామ్ లీక్డ్ టీజర్ రిలీజ్.. జీ5 ఓటీటీ సంచలనం

షాకింగ్‌గా 'ది స్కామ్ - లీక్డ్' టీజర్

కేవలం 1 నిమిషం 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో!" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో జీ5 ఈ వీడియోను పోస్ట్ చేసింది.

హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో కట్టుదిట్టమైన నిఘా మధ్య మెడికల్ క్వశ్చన్ పేపర్లు ప్రింట్ అవ్వడం, వాటిని 'కాన్ఫిడెన్షియల్' ట్యాగ్‌లతో బాక్సుల్లో సీల్ చేయడం టీజర్ ప్రారంభంలో కనిపిస్తుంది. అయితే ఆ బాక్సులు వాహనాల్లోకి ఎక్కకముందే, సిస్టమ్‌లోని ఒక వ్యక్తి అత్యంత సీక్రెట్‌గా ఫోన్‌లో ఫోటో తీసి ఆ పేపర్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తాడు.

క్షణాల్లో ఆ వార్త మీడియా చానెల్స్, న్యూస్‌రూమ్‌లలో బ్రేకింగ్ న్యూస్‌గా మారడం, ఆ తర్వాత క్లాస్‌రూమ్‌లు ఖాళీగా మారిపోవడం చూపిస్తూ మేకర్స్ కట్ చేశారు. టీజర్ చివర్లో ఖాళీ క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం చూపిస్తుండగా, టేబుల్ మీద ఉన్న ఫోన్‌లో 'పాపా కాలింగ్' అని స్క్రీన్ వెలుగుతుంది. ఈ ఒక్క సీన్ విజువల్ లాస్ట్ షాట్‌గా రావడం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

ఢిల్లీ నిరసనల నేపథ్యంలో..

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP), పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు సుదీర్ఘ నిరసనలు తెలుపుతున్న సమయంలోనే ఈ టీజర్ బయటకు రావడం విశేషం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల చేపట్టిన 'చలో సంసద్' మార్చ్‌ పై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో దేశమంతటా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

పీఎంవో ఆఫీస్ నుంచి గల్లీ దాకా నీట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సమయంలో జీ5 బృందం సమయం చూసి పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఈ షోను అనౌన్స్ చేసిందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్‌లో విపరీతమైన రెస్పాన్స్.. నెటిజన్ల హాట్ కామెంట్స్

ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్, ఎక్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్ కేటగిరీలోకి వచ్చింది. "సమస్యకు పరిష్కారం రాకముందే సినిమా వచ్చేసిందిరా బాబు!" అంటూ కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తుంటే, "ప్రస్తుత పరిస్థితులకు ఇది పర్ఫెక్ట్ ఐ-ఓపెనర్" అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సత్లూజ్' సినిమాను జీ5 ప్లాట్‌ఫామ్ నుంచి రిలీజ్ అయిన రెండు రోజులకే రీసెంట్ గా తొలగించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. "ఈ సిరీస్ డిలీట్ చేసేలోపే వెంటనే స్ట్రీమింగ్ చేయండి సామీ!" అని కొంతమంది వ్యంగ్యంగా రాసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేదా సీజేపీ నిరసన సీన్లు కూడా ఈ కథలో నిజంగా ఉంటాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా అడుగుతున్నారు.

ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్, నటీనటుల వివరాలను జీ5 బృందం సీక్రెట్‌గా ఉంచింది. అయితే పోస్ట్‌లో ప్రగతి దేశ్‌ముఖ్, సమీర్ ఎస్ రెడ్డిజ్, ఆనంద్ సింగ్, బల్విందర్ సింగ్ జంజువ లాంటి టాలెంటెడ్ ఫిలిం మేకర్స్‌ను ట్యాగ్ చేయడంతో ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నీట్ స్కామ్‌పై వస్తున్న ఈ బిగ్గెస్ట్ కంటెంట్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More