...
...
Next Story

కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు.. ఈటీవీ విన్ వర్సెస్ జీ5.. ఓటీటీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్

జీ5 ఓటీటీ నుంచి రీసెంట్‌గా వచ్చిన సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఈ సిరీస్ ట్రైలర్ చూసి తమ స్టోరీనే కాపీ కొట్టారని కానిస్టేబుల్ కనకం మేకర్స్ ఆరోపించారు. కోర్టులో కేస్ వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటీటీ సిరీస్ విరాటపాలెం సక్సెస్ మీట్‌లో జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్ చేశారు.

Published on: Jun 29, 2025, 13:19:19 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీ వేదికలు అయిన జీ5, ఈటీవీ విన్ మధ్య ఎవరిది ఒరిజినల్ కంటెంట్ అనే గొడవ నడుస్తోంది. రీసెంట్‌గా జూన్ 27 నుంచి జీ5లో తెలుగు హారర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, విరాటపాలెం ట్రైలర్ చూసిన కానిస్టేబుల్ కనకం మేకర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

విరాటపాలెం ట్రైలర్‌తో

కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు.. ఈటీవీ విన్ వర్సెస్ జీ5.. ఓటీటీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్ (Zee5 OTT Telugu/YouTube)
కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు.. ఈటీవీ విన్ వర్సెస్ జీ5.. ఓటీటీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్ (Zee5 OTT Telugu/YouTube)

తమ స్టోరీని కాపీ కొట్టి విరాటపాలెం తెరకెక్కించారని కానిస్టేబుల్ కనకం దర్శకనిర్మాతలు ఆరోపించారు. దీనిపై కోర్టులో కూడా కేసు వేసినట్లుగా చెప్పారు. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ సిరీస్‌గా కానిస్టేబుల్ కనకం రూపొందుతోంది. విరాటపాలెం ట్రైలర్ వచ్చిన కొన్ని రోజులకే తమదే ఒరిజినల్ గన్ అంటూ కానిస్టేబుల్ కనకం పోస్టర్‌ను రిలీజ్ చేసింది ఈటీవీ విన్ ఓటీటీ.

ఇక జూన్ 27న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయి సక్సెస్ అయినట్లుగా శనివారం (జూన్ 28) మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది జీ5 ఓటీటీ సంస్థ. ఈ సక్సెస్ మీట్‌లో జీ5 ఓటీటీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ కామెంట్స్ ఈటీవీ విన్ వర్సెస్ జీ5 అన్నట్లుగా ఉన్నాయి.

ఇది 20వ వసంతం

జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ .. "నేను స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. జీ తెలుగు సంస్థకు ఇది 20వ వసంతం. ఈ ప్రయాణంలో మాకు మీడియా ఎంతో అండగా నిలబడింది. మా టీం సహకారం వల్లే ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాం" అని అన్నారు.

"మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలను తీసుకువచ్చాం. మేం ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు. మేం ఎన్నో ఒరిజినల్ ఐడియాస్‌ను క్రియేట్ చేశాం. ‘ఆరంభం ఒక్క అడుగు’తో అంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఓటీటీ సంస్థల్లో మేం స్టాండర్డ్స్‌ను సెట్ చేశాం" అని అనురాధ తెలిపారు.

ఫస్ట్ ఫీమేల్ కాప్ స్టోరీ

"మేం జరిగిన వివాదం గురించి మాట్లాడం. మా కంపెనీ పాలసీని దాటి మేం మాట్లాడం. వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మేం ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్‌కు ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం" అని అనురాధ చెప్పారు.

పరువు నష్టం దావా

"ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తో వస్తూనే ఉంటాం. సత్యమేవ జయతే. మాకు మా కాంపిటీటర్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మా సంస్థను కించపరిచేలా మాట్లాడిన వారిపై పరువు నష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది" అని జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe