Zee5 Telugu: ఈ జులైలో జీ5 తెలుగుతో ఫుల్ జోష్.. వచ్చిన, వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసిన ఓటీటీ

Zee5 Telugu: ఈ జులై నెలలో తమ ఓటీటీలో వచ్చిన, వస్తున్న తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను జీ5 తెలుగు ఓటీటీ వెల్లడించింది. ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది.

Published on: Jul 4, 2026, 10:44:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Zee5 Telugu: జీ5 తెలుగు ప్లాట్‌ఫామ్ జులై నెలలో ఓటీటీ ఆడియన్స్‌కు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విందును వడ్డించబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా జోనర్లతో సరికొత్త కంటెంట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ జోష్ నింపింది.

Zee5 Telugu: ఈ జులైలో జీ5 తెలుగుతో ఫుల్ జోష్.. వచ్చిన, వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసిన ఓటీటీ
Zee5 Telugu: ఈ జులైలో జీ5 తెలుగుతో ఫుల్ జోష్.. వచ్చిన, వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసిన ఓటీటీ

జీ5 తెలుగు జులై లైనప్ ఇలా

ఈ జులై నెలకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ క్యాలెండర్‌ను జీ5 తెలుగు తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇందులో ముఖ్యంగా వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్న సినిమా ఉండటంతో నెటిజన్లలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

* జులై 3: వీరభద్రుని రహస్యం (సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - 60 ఎపిసోడ్లు)

* జులై 17: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ)

* కమింగ్ సూన్: అబ్జెక్షన్ మై లార్డ్ (శ్రీకాంత్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)

జులై 3 నుంచే షురూ: మిస్టరీ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'

జులై రేస్‌లో అందరికంటే ముందుగా 'వీరభద్రుని రహస్యం' వెబ్ సిరీస్ జీ5 తెలుగులో అడుగుపెట్టింది. మొత్తం 60 ఎపిసోడ్ల మెగా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు రాగా.. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు చేర్చబోతున్నారు. ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ చుట్టూ డైరెక్టర్ ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా మలిచాడు.

జులై 17 న వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'

ఈ జులై నెలలోనే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' కూడా వస్తోంది. 1990ల నాటి వింటేజ్ హీరో వడ్డే నవీన్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. జులై 17న డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నారు.

ఇందులో వడ్డే నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్ చుట్టూ జరిగే పొరపాట్లు, ఆఫీస్ పాలిటిక్స్ ను హిలేరియస్‌గా చూపిస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని డిజైన్ చేశారు. వడ్డే నవీన్ మార్క్ టైమింగ్, రాశీ సింగ్ గ్లామర్ సినిమాకు మెయిన్ అసెట్స్ కానున్నాయి.

కమింగ్ సూన్: ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా 'అబ్జెక్షన్ మై లార్డ్'

ఇక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ను కూడా జీ5 తెలుగు ప్లాన్ చేసింది. త్వరలోనే సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన అబ్జెక్షన్ మై లార్డ్ అనే కోర్టు రూమ్ డ్రామా వెబ్ సిరీస్ ను కూడా తీసుకొస్తోంది. ఇది ఈ నెల చివర్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా.. త్వరలోనే అని మాత్రం చెప్పింది. ఈ మూడు క్రేజీ ప్రాజెక్టులను కలిపి ఓ చిన్న వీడియోతో జీ5 తెలుగు జులై రిలీజెస్ పై అంచనాలు పెంచేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More