ఆస్పత్రులలో సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం భవిష్యత్తు ఊహగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇప్పుడు వైద్యుల రోజువారీ పనితీరులో భాగమైపోయింది. స్కాన్‌లను విశ్లేషించడం, సమాచారాన్ని క్రమబద్ధీకరించడం, పనిభారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే హెల్త్‌కేర్ విభాగంలో ఏఐ తదుపరి దశ వైద్యులను భర్తీ చేయడం కాదు. సాంకేతికత, వైద్య నిపుణుల నైపుణ్యం కలగలిసి రోగికి మరింత సురక్షితమైన వైద్యం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

వైద్య రంగంలో ఏఐని కేవలం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'గా మాత్రమే చూడకూడదు. దానిని 'ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్'గా భావించాలి. అంటే ఇది వైద్యుల సామర్థ్యాన్ని, కచ్చితత్వాన్ని పెంచే సాంకేతికతగా పనిచేస్తూనే, ప్రతి నిర్ణయంలోనూ రోగి శ్రేయస్సునే కేంద్రబిందువుగా ఉంచుతుంది.
స్వతంత్ర నిర్ణయాలు ఏఐ తీసుకోగలదా?
ప్రస్తుతం ఏఐ సిస్టమ్‌లు విస్తృతమైన వైద్య సమాచారాన్ని విశ్లేషించి, సంభావ్య వ్యాధి నిర్ధారణలను సూచించగలుగుతున్నాయి. కానీ, ఏఐ సొంతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను (Diagnostic Tests) ఆదేశించే స్థాయికి చేరడంపై భయాందోళనలు ఉన్నాయి. వైద్య నిర్ణయాలు కేవలం డేటా ఆధారంగా మాత్రమే జరగవు. రోగి శారీరక పరిశీలన, ఇతర ఆరోగ్య సమస్యలు (Co-morbidities), వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితి, క్లినికల్ అంచనాల ఆధారంగా నడుస్తాయి.
క్యాన్సర్ (ఆంకాలజీ) వంటి విభాగాల్లో సిటీ స్కాన్లు, బయాప్సీలు, మాలిక్యులర్ ప్రొఫైలింగ్, జెనెటిక్ టెస్టులు రోగి చికిత్స విధానాన్ని, ఖర్చులను, మానసిక ఆందోళనను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే ఏఐని ఒక 'ఇంటెలిజెంట్ కో-పైలట్'గా మాత్రమే వాడాలి. తుది నిర్ణయం ఎల్లప్పుడూ చికిత్స చేసే వైద్యుడిదే అయి ఉండాలి.
సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఏఐ చేరాలంటే విస్తృత క్లినికల్ ప్రయోగాలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థల ఆమోదం, చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులతో అనుసంధానం, నిరంతర పర్యవేక్షణ, అన్నింటికంటే మించి రోగుల నమ్మకం అవసరం.
ఏఐకి ఎక్కడ పూర్తి స్వేచ్ఛ ఇవ్వవచ్చు?
అయినప్పటికీ, ఆస్పత్రుల సమర్థతను సురక్షితంగా పెంచేందుకు కొన్ని విభాగాల్లో ఏఐకి స్వయంప్రతిపత్తి (Autonomy) ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్, బిల్లింగ్ సపోర్ట్, మెడికల్ కోడింగ్, డిశ్చార్జ్ సమ్మరీలు, ఇన్వెంటరీ నిర్వహణ, ఆపరేషన్ థియేటర్ల షెడ్యూలింగ్ వంటి పరిపాలనాపరమైన (Administrative) పనుల్లో ఏఐ ఆటోమేషన్ ఎంతో ఉపయోగపడుతుంది.
{{/usCountry}}అయినప్పటికీ, ఆస్పత్రుల సమర్థతను సురక్షితంగా పెంచేందుకు కొన్ని విభాగాల్లో ఏఐకి స్వయంప్రతిపత్తి (Autonomy) ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్, బిల్లింగ్ సపోర్ట్, మెడికల్ కోడింగ్, డిశ్చార్జ్ సమ్మరీలు, ఇన్వెంటరీ నిర్వహణ, ఆపరేషన్ థియేటర్ల షెడ్యూలింగ్ వంటి పరిపాలనాపరమైన (Administrative) పనుల్లో ఏఐ ఆటోమేషన్ ఎంతో ఉపయోగపడుతుంది.
{{/usCountry}}దీంతో పాటు రేడియాలజీ ప్రాధాన్యతలను గుర్తించడం, పాథాలజీ స్క్రీనింగ్, పేషెంట్ వైటల్ సైన్స్ పర్యవేక్షణ, రోగి ఆరోగ్యం క్షీణించే సంకేతాలను ముందే గుర్తించడంలోనూ ఏఐ తోడ్పడుతుంది.
మానవీయ స్పర్శ అవసరమైన చోట..
పరిపాలనా పనుల్లో ఏఐ సాయం తీసుకున్నప్పటికీ, కీలకమైన క్లినికల్ నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ వైద్యుల చేతుల్లోనే ఉండాలి. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, చికిత్స ఎంపికలపై చర్చించడం, రోగి అంగీకారం (Informed Consent) తీసుకోవడం, శస్త్రచికిత్స నిర్ణయాలు, సమస్యల నిర్వహణ, చేదు వార్తలను రోగులకు తెలియజేయడం, పాలియేటివ్ కేర్ వంటి విషయాల్లో మానవతా దృక్పథం, నైతిక ఆలోచన, అనుభవం అత్యంత అవసరం.
ఒకే వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు రోగులకు వయస్సు, ఇతర వ్యాధులు, కుటుంబ మద్దతు, వ్యక్తిగత లక్ష్యాలలో తేడాల వల్ల వేర్వేరు చికిత్సా పద్ధతులు అవసరమవుతాయి. ఇలాంటి వైవిధ్యాన్ని కేవలం మానవ నిపుణులు మాత్రమే సరిగ్గా అంచనా వేయగలరు.
ప్రధాన సవాళ్లు ఇవే
ఏఐ స్వయంప్రతిపత్తి సాధించడానికి సాంకేతికత అడ్డంకి కాదు. పాలన (Governance), బాధ్యత (Accountability), నమ్మకం (Trust) ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. ఆల్గోరిథమిక్ పక్షపాతం (Algorithmic bias), వాస్తవ ప్రపంచంలో పరిమిత పరీక్షలు, పారదర్శకత లేకపోవడం, డేటా గోప్యతా ఆందోళనలు, ఆస్పత్రుల మధ్య డిజిటల్ వ్యత్యాసాలు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.
ఈ సమస్యలను పరిష్కరించడానికి హెల్త్‌కేర్ సంస్థలు రోగి సురక్షితత్వం, వైద్యుల పర్యవేక్షణ, నైతిక వినియోగం, సైబర్ సెక్యూరిటీ, నిరంతర ఆడిటింగ్‌తో కూడిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స వంటి సంక్లిష్ట విభాగాల్లో ఏఐ అనేది 'మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డుల'కు మద్దతుగా నిలవాలి తప్ప, వాటిని భర్తీ చేయకూడదు.
భవిష్యత్తు ఆస్పత్రులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రోగి సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చేలా రూపుదిద్దుకుంటాయి. వైద్యుల తీర్పును, సమర్థతను, కచ్చితత్వాన్ని పెంచుతూనే రోగి శ్రేయస్సే పరమావధిగా పనిచేసే ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్‌గా ఏఐ నిలవనుంది.
వ్యాసకర్త:
డాక్టర్ కె.శ్రీకాంత్,
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్