IIT AI Course : ఏఐ స్టార్టప్ క్రియేషన్కి సువర్ణావకాశం! 4 లక్షల ప్రైజ్ మనీతో 5 రోజుల ప్రత్యేక ప్రోగ్రామ్!
IIT Madras AI Startup Course : ఐఐటీ మద్రాస్‌లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ 'బిల్డింగ్ ఏ సక్సెస్‌ఫుల్ ఏఐ స్టార్టప్' పేరుతో ఐదు రోజుల ఇన్-పర్సన్ కోర్సును ప్రకటించింది. ఆగస్టు 10 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపార ప్రపంచాన్ని సృష్టించాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, పరిశోధకులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన 'వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ' (డబ్ల్యూఎస్ఏఐ) క్యాంపస్‌లో నేరుగా పాల్గొనేలా ఒక వారం రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. తమ ఏఐ ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా ఎలా మలచుకోవాలో నేర్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.

'బిల్డింగ్ ఏ సక్సెస్‌ఫుల్ ఏఐ స్టార్టప్' పేరిట సాగే ఈ కోర్సును ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోనే నిర్వహించనున్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 27 వరకు ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులో ఏం నేర్పిస్తారు?
మార్కెట్‌లోని అవకాశాలను గుర్తించడం మొదలుకుని, మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్‌ని తయారు చేయడం, బిజినెస్ మోడల్‌ను రూపొందించడం, నిధుల సేకరణ, ఇన్వెస్టర్లకు ప్రాజెక్ట్‌ను వివరించడం వరకు ప్రతి దశపై ఈ ప్రోగ్రామ్‌లో ప్రాక్టికల్ అవగాహన కలిగిస్తారు.
గూగుల్ సెర్చ్ మాజీ వైస్ ప్రెసిడెంట్, ట్విట్టర్, ఐబీఎమ్, ఈవై సంస్థల మాజీ లీడర్, 'టుగెదర్ ఫండ్' జనరల్ పార్ట్‌నర్ లక్ష్మి శంకర్ ఈ కోర్సుకు నేతృత్వం వహించనున్నారు. తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ వ్యాయామాలు, ఏఐ స్టార్టప్ల రియల్ వరల్డ్ కేస్ స్టడీస్‌ను ఇందులో విశ్లేషిస్తారు. యూజర్లను ఆకర్షించడం, రాబడి వ్యూహాలు, నిధుల సమీకరణ, బిజినెస్ స్కేలింగ్ వంటి అంశాలపై లోతైన శిక్షణ ఉంటుంది.
బెస్ట్ ఐడియాకు రూ. 4 లక్షల బహుమతి..
ఈ ఐదు రోజుల శిక్షణ చివరి రోజున ‘పిచ్ డే’ నిర్వహిస్తారు. పాల్గొనే అభ్యర్థులు తమ స్టార్టప్ ఆలోచనలను ఇన్వెస్టర్ల ప్యానెల్ ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. అత్యుత్తమ ఏఐ స్టార్టప్ ఐడియాను అందించిన విజేత జట్టుకు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రూ. 4 లక్షల ప్రోత్సాహక బహుమతి అందజేస్తారు.
ఎవరు అర్హులు?
బీటెక్, ఎమ్‌టెక్, పీహెచ్‌డీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, రీసెర్చర్లు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రారంభ దశలో ఉన్న ఏఐ స్టార్టప్ నిర్వాహకులు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. జులై 27 లోగా https://forms.gle/D355g1noMz539mQx5 వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం డబ్ల్యూఎస్ఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


