Artificial Intelligence : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఏఐ ప్రదర్శన
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ, ఇంజినీరింగ్ ప్రదర్శన జరుగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో దేశంలోని 7 ప్రధాన నగరాల నుంచి 1000 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ-NIAT.. దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్-లెడ్ ఏఐ అండ్ ఇంజినీరింగ్ ప్రదర్శన టేక్ఓవర్ 2026ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జూలై 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో దేశంలోని 7 ప్రధాన నగరాల (ఢిల్లీ, జైపూర్, కొల్హాపూర్, పుణె, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, గుంటూరు) పరిధిలోని 18 క్యాంపస్‌లకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు.

రైతులకు, సామాన్యులకు ఉపయోగపడే రియల్ లైఫ్ ఏఐ (AI) సొల్యూషన్లను ఈ తరం ఇంజినీరింగ్ విద్యార్థులు ఎలా తయారు చేస్తున్నారో ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో లైవ్ ఏఐ ప్రోటోటైప్ ప్రదర్శనలు, షార్క్ ట్యాంక్ తరహా స్టార్టప్ పిచ్‌లు, హ్యాకథాన్‌లు, కోడింగ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం రూ.6.75 లక్షలకు పైగా నగదు బహుమతులు, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం అందించనున్నారు.
ఈ ప్రదర్శనలో టెక్నాలజీ రంగ ప్రముఖులు, ఇన్వెస్టర్లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. క్లాస్‌రూమ్ చదువులకే పరిమితం కాకుండా, సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు కనుగొనాలనే లక్ష్యంతో NIAT ప్రారంభించిన 'BRAVE' ఇనిషియేటివ్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం 3 నెలల్లో 150కి పైగా విద్యార్థుల బృందాలు రూ. 2 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి, 100కు పైగా స్టార్టప్‌లను ప్రారంభించాయి.
వీరితో పాటు ఐఐటీ/జెఈఈ ప్రిపరేషన్ కోసం థింక్‌జాయ్‌ఫుల్ లెర్నింగ్, మెడికల్ డాక్యుమెంటేషన్ కోసం మెడ్ ఏఐ, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ కోసం మెడ్‌ఫ్లో, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంటెలిజెన్స్ కోసం బిల్డ్‌ట్రాక్ వంటి ఏఐ ఆధారిత స్టార్టప్‌లను ఇన్వెస్టర్ల ముందు విద్యార్థులు పిచ్ చేస్తున్నారు.
మేకర్స్ కాన్‌క్లేవ్ విభాగంలో విద్యార్థులు ఆరోగ్యం, వ్యవసాయం, భద్రత, విపత్తు నిర్వహణ రంగాలపై లైవ్ ప్రోటోటైప్‌లను ప్రదర్శించారు. అందులో ముఖ్యమైనవి స్మార్ట్‌సర్వ్ ఏఐ : మనుషుల నిఘా అవసరం లేకుండా, అనుమానాస్పద కదలికలను గుర్తించి సెక్యూరిటీని అలర్ట్ చేసే అత్యాధునిక నిఘా వ్యవస్థ. న్యూరోగ్రిప్ : డిస్గ్రాఫియా వంటి మోటార్ డిజబిలిటీస్ (రాత లోపాలు) ఉన్నవారు సులభంగా రాసేందుకు సహాయపడే స్మార్ట్ అసిస్టివ్ పెన్.
వీటితో పాటు కోడింగ్ ప్రతిభను వెలికితీసేందుకు టేక్ఓవర్ హ్యాకథాన్, ఐసిపిసి వంటి జాతీయ పోటీలకు విద్యార్థులను సిద్ధం చేసే ఎన్ఐఏటీ కోడ్ క్వెస్ట్ వంటి విభాగాలు కూడా నడుస్తున్నాయి.
'ఏఐ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత రంగాలలో తదుపరి ఆవిష్కరణలు విద్యార్థుల నుంచే వస్తాయని మేం బలంగా నమ్ముతున్నాం. టేక్ఓవర్ 2026 అనేది కేవలం ఒక అకడమిక్ ఈవెంట్ కాదు. ఇక్కడ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఒక స్టార్టప్ ఫౌండర్‌లా ఆలోచించి నిజమైన ప్రోటోటైప్‌లను, స్టార్టప్‌లను నిర్మించారు. ఈ వేదిక వారికి పరిశ్రమ నిపుణులు, ఇన్వెస్టర్లతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది.' NxtWave, NIAT కో-ఫౌండర్, సీఈఓ రాహుల్ అత్తులూరి అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


