పెట్రోల్ భారం నుంచి విముక్తి? ఇంజిన్ మార్చకుండానే నీళ్లతో మైలేజ్ పెంచే కొత్త టెక్నాలజీ!

దేశంలో ఇంధన ధరలు మండిపోతున్న తరుణంలో, మొనాకోకు చెందిన ఒక ఫ్యూయల్ టెక్నాలజీ సంస్థ.. ఒక వినూత్న సాంకేతికతను తెరపైకి తెచ్చింది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే.. ఇంధనంలో సూక్ష్మమైన నీటి బిందువులను కలిపి మైలేజ్‌ను 10% పెంచేలా, కాలుష్యాన్ని భారీగా తగ్గించేలా టెక్నాలజీని కంపెనీ ఆవిష్కరించింది.

Published on: May 22, 2026, 05:42:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో, భారతీయ ఇంధన రంగంపై ఒత్తిడి తీవ్రమైంది. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులపై భారం పడకుండా రక్షించేందుకు రోజుకు రూ.1,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపును జాతీయ ఆర్థిక ప్రాధాన్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.4 మేర పెరిగాయి. క్లీన్ ఫ్యూయల్‌గా భావించే సీఎన్జీ ధరలు కూడా పెరిగావు.

ఇంజిన్ మార్చకుండానే నీళ్లతో మైలేజ్ పెంచే కొత్త టెక్నాలజీ!
ఇంజిన్ మార్చకుండానే నీళ్లతో మైలేజ్ పెంచే కొత్త టెక్నాలజీ!

భారతదేశం తన ముడిచమురు అవసరాల కోసం ఏకంగా 88% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో ఇంధన డిపెండెన్సీని తగ్గించడానికి, మొనాకోకు చెందిన ఫ్యూయల్ టెక్నాలజీ సంస్థ ‘ఎఫ్​ఓడబ్ల్యూఈ ఎకో సొల్యూషన్స్’ కనిపెట్టిన పేటెంటెడ్ ‘కేవిటెక్ ఫ్యూయల్ ఎమల్షన్ టెక్నాలజీ’ (Cavitech Fuel Emulsion Technology) భారత ఆర్థిక వ్యవస్థకు, ఆటోమొబైల్ రంగానికి ఒక పెద్ద సంజీవనిలా మారే అవకాశం కనిపిస్తోంది.

ఏంటీ ఈ నీటి ఆధారిత ఇంధన సాంకేతికత?

ఎఫ్​ఓడబ్ల్యూఈ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) హేమంత్ సోంధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిస్టమ్ వెనుక 'కంట్రోల్డ్ కేవిటేషన్ టెక్నాలజీ' (సీసీటీ) ఉంది.

ఇందులో ఎలాంటి రసాయన అడిటివ్స్ వాడకుండానే, ఇంధనంలో (పెట్రోల్/డీజిల్) అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులను సమానంగా చెదరగొడతారు.

ఈ ఇంధనం ఇంజిన్ లోపల కంబషన్ ఛాంబర్‌లోకి వెళ్లి మండేటప్పుడు.. ఆ నీటి బిందువులు 'మైక్రో-ఎక్స్‌ప్లోజన్స్' (చిన్న పేలుళ్లు) కు గురవుతాయి.

దీనివల్ల ఇంధనం మరింత అల్ట్రా-ఫైన్ పార్టికల్స్‌గా విడిపోయి, పూర్తిగా- అత్యంత సమర్థవంతంగా కాలిపోతుంది.

ఫలితంగా, సాధారణ పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని ఏకంగా 10% వరకు తగ్గిస్తుంది. అంటే వాహనాల మైలేజ్ పెరుగుతుంది.

కాలుష్యానికి భారీగా బ్రేక్..

ఈ కేవిటేషన్ ప్రక్రియ వల్ల భారీ ఇంధన చమురు విస్కాసిటీ (చిక్కదనం) కూడా తగ్గుతుంది. దీనివల్ల పంపింగ్, హీటింగ్ ఖర్చులు తగ్గుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ టెక్నాలజీ ద్వారా:

నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) ఉద్గారాలు దాదాపు 30% తగ్గుతాయి.

సల్ఫర్ ఆక్సైడ్ (SOx) ఉద్గారాలు దాదాపు 40% తగ్గుతాయి.

సైలెన్సర్ నుంచి వచ్చే పర్టిక్యులేట్ మ్యాటర్ (పొగ/కణాలు) దాదాపు సున్నా స్థాయికి పడిపోతుంది.

ఇండియాకు ఇది ఎందుకు గేమ్ చేంజర్?

ఈ కేవిటెక్ టెక్నాలజీలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికోసం వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు లేదా అదనపు హార్డ్‌వేర్ ఫిట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కార్లు, బైకులలోనే దీనిని నేరుగా ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం ఈ సాంకేతికతను మెరైన్ (ఓడల) ఇంజిన్లు, రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లు, పవర్ యూనిట్లు, పారిశ్రామిక ఫర్నేసులలో విజయవంతంగా పరీక్షించారు. ఇది సాధారణ వాహన ఇంజిన్లలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ గనుక భారత మార్కెట్లోకి వస్తే.. కేవలం పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఆదా చేస్తూ, దేశ ఆర్థిక రంగానికి పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More