సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం తన ఊరి నదిని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. నెలల తరబడి ఒంటరిగా పోరాడి, చెత్తాచెదారంతో నిండిపోయిన నదిని పునరుద్ధరించాడు. ఆ యువకుడి అంకితభావానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ 'ది ఓషన్ క్లీనప్' సీఈఓ బొయాన్ స్లాట్ అతడికి నేరుగా తమ సంస్థలో పనిచేసేందుకు ఆఫర్ ఇచ్చారు.
మాతో కలిసి పనిచేయండి: డచ్ సీఈఓ ఆఫర్

మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా బియోరా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహిగా ప్రసిద్ధుడు) గత కొన్ని నెలలుగా అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, నాచును తొలగిస్తూ స్వచ్ఛమైన నదిగా మార్చాడు. నది పాత, కొత్త రూపాలకు సంబంధించిన ఫోటోలను ఒక ఎక్స్ (ట్విటర్) వినియోగదారుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ పోస్ట్ 'ది ఓషన్ క్లీనప్' సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ బొయాన్ స్లాట్ దృష్టికి వెళ్లింది. ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయిన స్లాట్.. "మా సంస్థలో పనిచేయడానికి వచ్చేయండి" (Come work for us) అంటూ ఆ పోస్ట్ కింద కామెంట్ చేశారు. ఈ ఊహించని ఆహ్వానంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సొంత డబ్బులతో నదికి నయా లుక్
బిట్టు తబాహి ఈ ఏడాది జనవరి నుంచి అజ్నార్ నదిని శుభ్రం చేసే పనిని ప్రారంభించాడు. ప్రతిరోజు నదిలో దిగి ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను తొలగిస్తూ ఆ దృశ్యాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. కేవలం లైక్‌లు, వ్యూస్ కోసమే ఇదంతా చేస్తున్నాడని ప్రారంభంలో కొందరు విమర్శించినప్పటికీ అతడు వెనకడుగు వేయలేదు. ఈ శ్రమకోసం అతడు తన సొంత డబ్బు రూ. 30,000 వరకు వెచ్చించినట్లు సమాచారం.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
బిట్టు చేస్తున్న కృషిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం గమనించి గత మార్చిలో అభినందించారు. "సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం ప్రయత్నిస్తున్నా, దానివల్ల సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిందే. బిట్టు తబాహి కృషి నాకు #MondayMotivation)" అని ఆనంద్ మహీంద్రా అప్పట్లో ఎక్స్‌లో కొనియాడారు.
ఎవరీ బొయాన్ స్లాట్?
{{/usCountry}}బిట్టు చేస్తున్న కృషిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం గమనించి గత మార్చిలో అభినందించారు. "సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం ప్రయత్నిస్తున్నా, దానివల్ల సమాజానికి మేలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిందే. బిట్టు తబాహి కృషి నాకు #MondayMotivation)" అని ఆనంద్ మహీంద్రా అప్పట్లో ఎక్స్‌లో కొనియాడారు.
ఎవరీ బొయాన్ స్లాట్?
{{/usCountry}}నెదర్లాండ్స్‌కు చెందిన బొయాన్ స్లాట్ పర్యావరణ వేత్త, పరిశోధకుడు. సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే లక్ష్యంతో 'ది ఓషన్ క్లీనప్' అనే ఎన్జీఓను స్థాపించారు. 2040 నాటికి సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.