బంజారాహిల్స్ టూ గచ్చిబౌలి: హైదరాబాద్‌లో ప్రేమికుల ఫేవరెట్ హాట్‌స్పాట్స్ ఇవే

హైదరాబాద్‌లో డేటింగ్ సంస్కృతి, లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలపై 'హ్యాపెన్' (happn) డేటింగ్ యాప్ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. బంజారాహిల్స్, గచ్చిబౌలితో పాటు నిలోఫర్ ఛాయ్, ట్యాంక్ బండ్ వంటి స్థలాలు భాగ్యనగర యూత్ మనసు దోచుకుంటున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

Updated on: Nov 2, 2026, 14:51:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రముఖ రియల్-లైఫ్ డేటింగ్ యాప్ 'హ్యాపెన్' (happn) భారతదేశంలో సరికొత్తగా 'నైబర్‌హుడ్' (Neighborhood) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా యూత్ డేటింగ్ ప్రాధాన్యతలు, వారు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాలపై ఓ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, సరస్సుల తీరాలు లవర్స్ కనెక్షన్లను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ డేటా స్పష్టం చేస్తోంది.

బంజారాహిల్స్ టూ గచ్చిబౌలి: హైదరాబాద్‌లో ప్రేమికుల ఫేవరెట్ హాట్‌స్పాట్స్ ఇవే
బంజారాహిల్స్ టూ గచ్చిబౌలి: హైదరాబాద్‌లో ప్రేమికుల ఫేవరెట్ హాట్‌స్పాట్స్ ఇవే

నైబర్‌హుడ్‌తో సులభంగా..

ఆన్‌లైన్ డేటింగ్, నిజ జీవిత భేటీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా హ్యాపెన్ ఈ ఫీచర్‌ను డిజైన్ చేసింది. యూజర్లు తమకు ఇష్టమైన పరిసర ప్రాంతాలను ప్రొఫైల్‌లో ప్రత్యక్షంగా పేర్కొనే అవకాశం దీనివల్ల లభిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కడ సమయం గడుపుతున్నారనే అంశం వారి జీవనశైలి, ఆలోచనలు, అలవాట్లను తెలియజేస్తుందని హ్యాపెన్ యాప్ ప్రతినిధులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో టాప్-10 డేటింగ్ ప్రాంతాలు

హ్యాపెన్ విశ్లేషణ ప్రకారం హైదరాబాద్ నగరంలో సింగిల్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్న టాప్-10 ప్రాంతాల జాబితా ఇదే.

బంజారాహిల్స్: విలాసవంతమైన కేఫ్‌లు, మనోహరమైన వ్యూస్‌తో నగరంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

గచ్చిబౌలి: ఐటీ ఉద్యోగులకు, టెక్ ప్రాఫెషనల్స్‌కు ప్రధాన అడ్డాగా మారింది.

సికింద్రాబాద్: సైనిక కంటోన్మెంట్ ప్రశాంతత, పాతకాలపు బేకరీలు, చారిత్రక క్లబ్‌లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

హైటెక్ సిటీ: టెక్ ప్రపంచపు గుండెకాయలా నూతన జంటలను ఆకర్షిస్తోంది.

మాదాపూర్: ఆహారప్రియులకు స్వర్గధామంగా డేటింగ్ చార్ట్స్‌లో నిలిచింది.

బెేగంపేట్: ప్రధాన రవాణా అనుసంధాన కేంద్రంగా ఆకట్టుకుంటోంది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్: ఎత్తైన భవనాలు, ఆధునిక వాతావరణంతో యూత్‌ను ఆకర్షిస్తోంది.

జూబ్లీహిల్స్: రాత్రివేళల్లో నైట్‌లైఫ్, లగ్జరీ రూఫ్‌టాప్ లాంజ్‌లకు కేంద్రంగా ఉంది.

కొండాపూర్: వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతంగా పేరుగాంచింది.

హిమాయత్‌నగర్: సాంప్రదాయ రుచులు, పాత నగర సంస్కృతితో టాప్-10లో చోటు సాధించింది.

తొలి కలయికకు కేరాఫ్ అడ్రస్.. ట్యాంక్ బండ్, నిలోఫర్ ఛాయ్

కేవలం ప్రాంతాలే కాకుండా, మొదటిసారి కలుసుకోవడానికి హైదరాబాదీలు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశాలను కూడా ఈ సర్వే వెల్లడించింది.

వాటర్ ఫ్రంట్ రొమాన్స్: హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ట్యాంక్ బండ్ పార్క్ నగరంలోనే అత్యంత ఆదరణ పొందిన డేటింగ్ స్పాట్‌గా నిలిచింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వాకింగ్ ట్రాక్, చారిత్రక చార్మినార్ పరిసరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇరానీ ఛాయ్, నైట్ ఫుడ్ సంస్కృతి: గ్రాండ్ డైనింగ్ కంటే లోకల్ రుచులకే హైదరాబాదీలు మొగ్గు చూపుతున్నారు. నిలోఫర్ కేఫ్‌లో ఇరానీ ఛాయ్ తాగడం లవర్స్‌కు ఒక వేడుకలా మారింది. ఇక గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ ఫుడ్ కోర్టులో అర్ధరాత్రి దోశ, మ్యాగీ తినేందుకు యూత్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

సినిమా, నైట్‌లైఫ్: ఏఎమ్‌బీ సినిమాస్, పీవీఆర్ మల్టీప్లెక్స్‌లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజమ్ క్లబ్, బంజారాహిల్స్‌లోని బార్బీక్యూ నేషన్ నైట్‌లైఫ్ ప్రియుల మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి.

'పర్‌ఫెక్ట్ డేట్' కోసం రాయల్ ఎంపికలు

హ్యాపెన్ యాప్‌లోని 'పర్‌ఫెక్ట్ డేట్' ఫీచర్ ద్వారా చౌమహల్లా ప్యాలెస్, వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్, హార్డ్ రాక్ కేఫ్, ఎక్సోటికా వంటి ప్రదేశాలను ప్రత్యేకంగా ఎంచుకుంటున్నట్లు డేటా తెలిపింది.

"డేటింగ్ అనేది కేవలం స్క్రీన్ పై ఉన్న ప్రొఫైళ్లను స్వైప్ చేయడం మాత్రమే కాదు. ఇది నిజ జీవితంలోని అనుభూతులను ప్రతిబింబించాలి. నగరంలో మీరు ఉండే ప్రాంతమే మీ అసలు జీవితానికి వేదిక. 'నైబర్‌హుడ్' ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన వాతావరణంలో భాగస్వాములను కనుగొనవచ్చు" అని హ్యాపెన్ సీఈఓ కరీమా బెన్ అబ్దెల్ మాలెక్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా, ఒక్క భారతదేశంలోనే 4.6 కోట్ల మంది యూజర్లతో హ్యాపెన్ డేటింగ్ రంగంలో ముందంజలో ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More