పెంపకంలో ఓపిక ముఖ్యం: చిన్నారి మనసు చాలా సున్నితం

నలుగు నుండి ఐదేళ్ల లోపు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చాలా ఓపికగా ఉండాలి. ఈ వయసులో పిల్లలు చేసే కొన్ని చర్యలు వాళ్లు సంతోషంగా, సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతున్నారని సూచిస్తాయి. 

Published on: Oct 22, 2025, 16:12:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాలుగు నుండి ఐదేళ్ల వయసున్న పిల్లల పెంపకానికి తల్లిదండ్రులకు చాలా ఓర్పు మరియు అవగాహన అవసరం. చిన్న కోపం, అల్లరి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడినా లేదా దండిచినా ఆ ప్రభావం పిల్లల సున్నితమైన మనసుపై చాలా తీవ్రంగా పడుతుంది. ఈ రోజుల్లో మారుతున్న వాతావరణం, కొత్త గాడ్జెట్‌లు, సోషల్ మీడియా యుగంలో బిడ్డను పెంచడం ఏ మాత్రం సులువు కాదు.

పెంపకంలో ఓపిక ముఖ్యం: చిన్నారి మనసు చాలా సున్నితం
పెంపకంలో ఓపిక ముఖ్యం: చిన్నారి మనసు చాలా సున్నితం

తల్లిదండ్రులు కొంచెం అజాగ్రత్తగా ఉంటే, పిల్లలు మొండిగా లేదా దురుసుగా తయారయ్యే ప్రమాదం ఉంది. అదే అతిగా కఠినంగా ఉంటే, వారు భయస్తులుగా, చిరాకుపడేవారిగా మారవచ్చు. దానివల్ల వారి ఆత్మవిశ్వాసం (Self-Confidence) కూడా తగ్గిపోతుంది. మీరు తల్లిదండ్రులుగా మీ పెంపకం తీరును అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే మీ బిడ్డ వైపు ఒకసారి చూడండి. వారు ఈ ఐదు రకాల పనులు చేస్తుంటే, మీరు పెంచుతున్నది సంతోషంగా ఉన్న చిన్నారి అని నిర్ధారించుకోవచ్చు.

1. ఊహాలోకంలో (Daydreaming) మునిగిపోవడం

మీ పిల్లలు తమ బొమ్మలతో మాట్లాడుతున్నా, ఆడుకుంటున్నా, రకరకాల బ్లాక్‌లు నిర్మిస్తున్నా, లేదా ఊహాజనిత ప్రపంచంలో (Imagination) మునిగిపోయి ఉంటే- దీని అర్థం మీ బిడ్డ తమ చుట్టూ ఉన్న వాతావరణంలో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారని. పిల్లలు తమను తాము సురక్షితంగా భావించినప్పుడు, వారి మెదడు మరింత స్వేచ్ఛగా ఆలోచించగలుగుతుంది, కొత్త విషయాలను అన్వేషించడానికి (Explore) ప్రయత్నిస్తుంది.

2. మీ అభిప్రాయంతో ఏకీభవించకపోవడం

మీరు చెప్పిన ఒక మాటతో మీ బిడ్డ సమస్యం కాదని (Disagree) చాలా స్పష్టంగా చెప్పగలిగితే, అది వారి ధైర్యాన్ని సూచిస్తుంది. అంటే, వారు మిమ్మల్ని విశ్వసిస్తారు, మరియు భావోద్వేగాల పరంగా తాము సురక్షితంగా ఉన్నామని అనుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడకపోవడం అనేది ఆరోగ్యకరమైన మానసిక ఎదుగుదలకు చిహ్నం.

3. మిమ్మల్ని అనుకరించడం (Copying)

మీ పిల్లలు మీ చేష్టలను (Gestures) గమనించి, వాటిని అనుకరిస్తుంటే, మీ ప్రత్యేకమైన మాటను లేదా పనిని పునరావృతం చేస్తుంటే, అది ఒక సంకేతం. అంటే, వారు మిమ్మల్ని తమకు ఆదర్శంగా (Role Model) భావిస్తున్నారని, మీలా ఉండాలని కోరుకుంటున్నారని అర్థం.

4. మీ చుట్టూ సరదాగా అల్లరి చేయడం

పిల్లలు మీ దగ్గర ఎలాంటి సంకోచం లేకుండా నవ్వడం, వింత ముఖాలు పెట్టడం, కిలకిలారావాలు చేయడం వంటి అల్లరి చేస్తుంటే, వారు తమ చుట్టూ ఉన్న వాతావరణంలో సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నారని అర్థం. తల్లిదండ్రుల చుట్టూ నాలుగు నుండి ఐదేళ్ల బిడ్డ భయపడి లేదా కేవలం చెప్పిన మాటలు మాత్రమే వింటూ ఉంటే, అది వారు సంతోషంగా ఉన్న చిన్నారి కాదని సూచించవచ్చు.

5. తమ భావోద్వేగాలను పంచుకోవడం

కోపంలో ఏడుస్తూనే, 'నాకు మీరంటే ద్వేషం' (I Hate You) అని ఒక బిడ్డ చెప్పగలిగితే, దాని అర్థం ఏమిటంటే- వారు తమ భావోద్వేగాలను (Emotions) చాలా సులభంగా బయటకు వ్యక్తం చేయగలరు అని. జెంటిల్ పేరెంటింగ్ (Gentle Parenting) ద్వారా పెరిగే పిల్లలు తమ భావాలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకోవడానికి వెనకాడరు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More