ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
Happy Karthika Pournami 2026 : కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. మీ ఆత్మీయుల జీవితాల్లో వెలుగులు నింపే 50 ప్రత్యేక సందేశాలు
Happy Karthika Pournami 2026 : కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపేందుకు మీకోసం 50 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మెసేజ్‌లు ఇక్కడ చదవండి.
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానాలు ఆచరించడం, తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం, జ్వాలా తోరణాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ శుభ సందర్భంలో మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసేందుకు 50 విషెస్ ఇక్కడ ఉన్నాయి.

ఆ పరమేశ్వరుని చల్లని చూపు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే ప్రతి దీపం మీ ఇంటిల్లిపాది జీవితాల్లోని చీకట్లను తొలగించి, సుఖసంతోషాలను నింపాలి.
శివకేశవుల ఆశీస్సులతో మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆశిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
నిండు పున్నమి వెన్నెలలా మీ కుటుంబంలో ఆనందం, ప్రశాంతత ఎల్లప్పుడూ నిండి ఉండాలి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
తులసి మాత అనుగ్రహంతో మీ కుటుంబంలో ఐక్యత, ప్రేమ, శ్రేయస్సు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
భక్తిశ్రద్ధలతో మీరు చేసే కార్తీక దీపారాధన ఫలించి, మీ మనసులోని కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి 2026
ఆ గంగాధరుని కరుణతో మీ కుటుంబానికి ఎటువంటి ఆపదలు రాకుండా, నిత్యం శుభాలే కలగాలని ఆకాంక్షిస్తూ పౌర్ణమి శుభాకాంక్షలు 2026
ఈ పర్వదినం మీ జీవితంలో కొత్త వెలుగులను, సరికొత్త ఆశలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
కైలాసవాసుని కృపతో మీ ఇంట పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లాలి. Happy Karthika Pournami
కార్తీక మాసపు పున్నమి వేళ ఆ పరమాత్ముని దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా తోడుగా ఉండాలి. Happy Karthika Pournami 2026
నేస్తమా.. ఈ కార్తీక పౌర్ణమి నీ జీవితంలో సరికొత్త విజయాలకు నాంది పలకాలని కోరుకుంటూ శుభాకాంక్షలు!
మనం వెలిగించే కార్తీక దీపాల కాంతిలాగే, మన స్నేహం కూడా ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మిత్రమా!
నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి, పున్నమి చంద్రునిలా నీ భవిష్యత్తు ప్రకాశించాలని ఆశిస్తున్నాను. Happy Karthika Pournami 2026
ఆ భోళాశంకరుని దయవల్ల నీవు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ పౌర్ణమి శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన రోజున నీ మనసు ప్రశాంతతతో, నీ జీవితం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
కార్తీక దీపాల వెలుగులో నీ జీవితంలోని ప్రతి అడుగు విజయం వైపు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
హర హర మహాదేవ శంభో శంకర! ఆ దేవదేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
స్నేహమనే దీపానికి ఆప్యాయత అనే నూనె పోస్తూ, ఈ పౌర్ణమిని ఆనందంగా జరుపుకుందాం. Happy Karthika Pournami 2026
నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, ఆ శివయ్య అండతో వాటన్నింటినీ అధిగమించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి 2026
ఈ కార్తీక పున్నమి నీకు, నీ ఆత్మీయులకు మరపురాని మధుర క్షణాలను అందించాలని ఆశిస్తున్నాను. Happy Karthika Pournami 2026
"ఓం నమః శివాయ" అనే పంచాక్షరి మంత్రం మీ ఇంట మారుమోగుతూ, సకల శుభాలను కలిగించాలి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
కార్తీక దామోదరుని స్మరణతో మీ పాపాలన్నీ తొలగిపోయి, పుణ్యఫలం లభించాలని ప్రార్థిస్తున్నాను. Happy Karthika Pournami 2026
జ్వాలా తోరణ దర్శనంతో మీ జీవితంలోని సమస్త దోషాలు తొలగి, ఐశ్వర్యం సిద్ధించాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami
గంగా స్నానం, దీప దానం చేసే ఈ పవిత్ర దినాన ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు మీపై ప్రసరించాలి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
ఈ కార్తీక పౌర్ణమి మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాలని ఆశిస్తున్నాను. Happy Karthika Pournami 2026
వెలిగించే ప్రతి వత్తి మీ అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహంతో మీ జీవితం సుఖమయం కావాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ కార్తీక పౌర్ణమి
ఉసిరి చెట్టు కింద దీపారాధన, తులసి కోట వద్ద పూజలు మీ కుటుంబానికి రక్షగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. Happy Karthika Pournami 2026
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే.. ఆ జగన్మాత దయతో మీ ఇంట నిత్యం శుభాలు కలగాలి. Happy Karthika Pournami
కార్తీక పున్నమి నాడు ఆకాశంలో వెలిగే చందమామలా, మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
దీపాల కాంతులతో, భక్తి పారవశ్యంతో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
శివకేశవుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. హ్యాపీ కార్తీక పౌర్ణమి!
మీ జీవితంలో వెలుగులు నింపే పవిత్ర పర్వదినం.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
హర హర మహాదేవ! అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
ఈ పున్నమి వెలుగులు మీ ఇంట ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
భక్తితో వెలిగించే ఒక్క దీపం.. వేయి శుభాలకు సంకేతం. పౌర్ణమి శుభాకాంక్షలు!
ఆ పరమేశ్వరుని కృపతో అంతా మంచే జరగాలి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 2026.
మీ ఇంట సిరిసంపదలు, మనసులో ప్రశాంతత వెల్లివిరియాలి. Karthika Pournami 2026 శుభాకాంక్షలు!
కార్తీక మాసపు విశిష్ట పర్వదినం.. మీకు సకల శుభాలను అందించాలి. హ్యాపీ కార్తీక పౌర్ణమి2026
దీపకాంతుల నడుమ ఆధ్యాత్మిక ఆనందం మీ సొంతం కావాలి. పౌర్ణమి శుభాకాంక్షలు 2026!
మీ వృత్తి, వ్యాపారాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 2026.
ఈ పవిత్ర పర్వదినం మీకు నూతన ఉత్సాహాన్ని, సానుకూల దృక్పథాన్ని అందించాలని ఆశిస్తున్నాను. Happy Karthika Pournami 2026
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి, జీవితంలో స్థిరపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కార్తీక పౌర్ణణి శుభాకాంక్షలు 2026
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆ పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందకరమైన, భక్తిపూర్వకమైన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 2026
ఈ పౌర్ణమి మీ జీవితంలోని అన్ని రకాల ఆటంకాలను తొలగించి, ప్రగతి పథంలో నడిపించాలి. Happy Karthika Purnima 2026
మీ ఇంట ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలు వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. Happy Karthika Pournami 2026
పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి వేళ మీ ఆశయాలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. Happy Karthika Pournami 2026
చీకటిని తరిమికొట్టే దీపంలా, మీ జీవితంలోని నిరాశను తరిమికొట్టి ఆశల వెలుగులు నింపుకోండి.. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
సకల జీవరాశులకు ఆ దేవదేవుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. Happy Karthika Purnima 2026

E-Paper
