వాలెంటైన్స్ డే 2026: మీ మనసులోని మాటను తెలియజేసే 10 ఆత్మీయ సందేశాలు ఇవే
వాలెంటైన్స్ డే కోసం కేవలం ఖరీదైన బహుమతులే కాదు, మనం పంచుకునే చిన్న సందేశం కూడా అవతలి వ్యక్తి హృదయాన్ని తాకుతుంది. అందుకే, మీ భాగస్వామికి, స్నేహితులకు లేదా ఆత్మీయులకు పంపేందుకు సందేశాలు ఇక్కడ ఉన్నాయి.
వాలెంటైన్స్ డే 2026 వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14 శనివారం రావడంతో ప్రేమికులు, స్నేహితులు తమ ఆత్మీయులతో సమయం గడిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఖరీదైన బహుమతులే కాదు, మనం పంచుకునే చిన్న సందేశం కూడా అవతలి వ్యక్తి హృదయాన్ని తాకుతుంది. అందుకే, మీ భాగస్వామికి, స్నేహితులకు లేదా ఆత్మీయులకు పంపేందుకు 10 ప్రేమ సందేశాలు ఇక్కడ ఉన్నాయి.

Happy Valentine's day wishes: వాలెంటైన్స్ డే సందేశాలు
మీ భాగస్వామి పట్ల మీకున్న గాఢమైన ప్రేమను ఈ మాటలతో వ్యక్తపరచండి:
- మై లవ్.. నా నేడు, నా రేపు.. అంతా నువ్వే. హాపీ వాలెంటైన్స్ డే.
- నా శ్వాస నీ ధ్యాసే.. నేనెప్పటికీ నీకోసమే.. హ్యాపీ వాలెంటైన్స్ డే
- నువ్వు నా తోడుంటే చాలు… ఎంత చిన్న పనైనా సంతోషాన్నిస్తుంది.. ఎంత పెద్ద సాహసమైనా చిన్న పనిగా తోస్తుంది.. లవ్ యూ బంగారం, హాపీ వాలంటైన్స్ డే"
- నా మనసులో, ఆలోచనలో నువ్వు లేని క్షణం లేదు.. నిన్నటి కంటే ఈరోజు, నేటి కంటే రేపు నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటాను.. హ్యాపీ వాలెంటైన్స్ డే..
- ఎన్ని జన్మలకైనా నువ్వే నా లవ్.. హ్యాపీ వాలెంటైన్స్ డే
- ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే.. అది నీ పక్కనే.. లవ్ యూ రా… హ్యాపీ వాలెంటైన్స్ డే
- నువ్వు కనిపిస్తే చాలు.. నా మనసులో తెలియని అలజడి.. లైఫ్ లాంగ్ ఈ ఫీలింగ్ ఇలాగే ఉండాలి.. హ్యాపీ వాలెంటైన్స్ డే
- మన ప్రేమను ఈ దూరం ఎప్పటికీ తక్కువ చేయదు.. నీ గెలుపే నా సంతోషం.. నీ సంతోషమే నా గెలుపు.. హాపీ వాలెంటైన్స్ డే మై లవ్
- నీపై నా ప్రేమకు బౌండరీలు లేవు.. నా మనసులో నీ గురించి ఆలోచనలకు బ్రేకులు లేవు.. లవ్ యూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే
- నీ తలపులే నాకు ఓదార్పు.. నీ ఊసులే నాకు మైమరుపు.. లవ్ యూ బంగారం.. హ్యాపీ వాలెంటైన్స్ డే
ప్రేమను వ్యక్తపరచడానికి భాష అడ్డంకి కాదు, కానీ మన మాతృభాషలో చెప్పినప్పుడు ఆ భావం నేరుగా హృదయానికి చేరుతుంది. పైన పేర్కొన్న సందేశాలలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకుని, ఈ వాలెంటైన్స్ డేని మరింత గుర్తుండిపోయేలా చేసుకోండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper












