భారతీయ వంటకాల్లో పసుపు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, రుచి, రంగు, ఆరోగ్యానికి కూడా ఇది ఒక ముఖ్యమైన పదార్థంగా చూస్తారు. ప్రతీ కూరలో పసుపు తప్పనిసరి. ఏదైనా దెబ్బతగిలినప్పుడు కూడా దాదాపు ప్రతి ఇంట్లో పసుపును ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాల కారణంగా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో లభించే పసుపు స్వచ్ఛమైనదేనని చెప్పలేం.

పెరుగుతున్న కల్తీ కారణంగా.. పసుపులో తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, రంగులను కలుపుతున్నారు. అందువల్ల ఇంట్లో దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
పసుపు రంగును, మృదువైన ఆకృతికి ఇవ్వడానికి మెటానిల్ యెల్లో, లెడ్ క్రోమేట్ వంటి కృత్రిమ రంగులు, రసాయనాలను తరచుగా కలుపుతారు. కొన్ని సందర్భాల్లో సుద్ద పొడి, అడవి పసుపు, లేదా నాణ్యత లేని ముడి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. అందుకే పసుపును కొనుగోలు చేసేటప్పుడు కేవలం రంగుపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.
ఎలా తెలుసుకోవాలి?
పసుపు అసలైనదా లేదా నకిలీదా అని కన్ఫామ్ చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం నీటితో పరీక్షించడం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు వేసి కాసేపు అలానే ఉంచండి. ఒకవేళ పసుపు అడుగున పేరుకుపోయి, నీరు లేత పసుపు రంగులోనే ఉంటే.. అది స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. అయితే ఒకవేళ నీరు ముదురు పసుపు రంగులోకి మారి, పసుపు పూర్తిగా కరిగిపోతే, అది కల్తీకి సంకేతం కావచ్చు.
అరచేతి ద్వారా కూడా పసుపు ప్యూరిటీని తెలుసుకోవచ్చు. మీ అరచేతిలో చిటికెడు పసుపును ఉంచి 10 నుండి 20 సెకన్ల పాటు మీ బొటనవేలితో రుద్దండి. ఆ పసుపు అసలైనదైతే.. అది మీ అరచేతిపై లేత పసుపు మరకను కలిగి ఉంటుంది. నకిలీ లేదా అధికంగా కల్తీ చేసిన పసుపు వేరే రంగును ఉంటుంది లేదా త్వరగా రంగు వెలిసిపోతుంది.
పసుపులో మెటానిల్ ఎల్లో వంటి కల్తీ పదార్థాలు ఉన్నాయో లేదో పరీక్షించడానికి, ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా పసుపు పొడి వేసి, కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారితే, పసుపులో మెటానిల్ ఎల్లో కల్తీ జరిగి ఉండవచ్చు. దీనిద్వారా ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వికారం, అజీర్ణం కలగవచ్చు.
{{/usCountry}}పసుపులో మెటానిల్ ఎల్లో వంటి కల్తీ పదార్థాలు ఉన్నాయో లేదో పరీక్షించడానికి, ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా పసుపు పొడి వేసి, కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారితే, పసుపులో మెటానిల్ ఎల్లో కల్తీ జరిగి ఉండవచ్చు. దీనిద్వారా ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వికారం, అజీర్ణం కలగవచ్చు.
{{/usCountry}}పసుపులో కల్తీని పరీక్షించడానికి దానిని నీరు, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలుపుతారు. బుడగలు ఏర్పడితే.. అందులో కల్తీ ఉన్నట్లు అర్థం. రోజూ వాడే మసాలాల మంచివని తెలుసుకోవడం ముఖ్యం. పసుపును తక్కువ పరిమాణంలో వాడినప్పటికీ, కల్తీ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల మార్కెట్లో పసుపు కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన బ్రాండ్‌ను ఎంచుకుని, ఇంట్లో క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఉత్తమం.