BRS Jagtial Meeting : ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ సభ - మళ్లీ ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్!

BRS Jagtial Meeting : ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో BRS భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పార్టీ అధినేత కేసీఆర్ రాకతో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Published on: Apr 20, 2026, 07:28:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్…. మరోవైపు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే సీనియర్ నేత జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి… పార్టీలోకి తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది. అయితే ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాల గడ్డపై భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం జరిగే ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు.

కేసీఆర్
కేసీఆర్

భారీగా జనసమీకరణ…!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. జగిత్యాల గడ్డపై నిర్వహించే ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం…. లక్షలాది మంది జన సమీకరణకు ప్రణాళికలు రచించింది.

ఈ సభకు జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగానే జనాలు వచ్చే అవకాశం ఉంది. సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణం మొత్తం గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులు గ్రామగ్రామాన పర్యటించి కార్యకర్తలను సభకు తరలించే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత, రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి…!

ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, బలాన్ని మరోసారి చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సభ విజయవంతం కోసం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ వస్తుండటంతో.. ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం పార్టీ శ్రేణులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయన స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది…!

ఇక ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సభ విజయవంతంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. జీవన్ రెడ్డి వర్గీయులు, సహచరులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చేందుకు, ఇతరులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More