ఈ ఈజీ చిట్కాలతో వంటలో వాడే పసుపు అసలైనదా, నకిలీదా తెలుసుకోండి
ఈరోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోయింది. వంటగదిలోకి తీసుకొచ్చేవి కూడా నకిలీవి అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఫేక్ పసుపును గుర్తించడం ఎలానో ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ వంటకాల్లో పసుపు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, రుచి, రంగు, ఆరోగ్యానికి కూడా ఇది ఒక ముఖ్యమైన పదార్థంగా చూస్తారు. ప్రతీ కూరలో పసుపు తప్పనిసరి. ఏదైనా దెబ్బతగిలినప్పుడు కూడా దాదాపు ప్రతి ఇంట్లో పసుపును ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాల కారణంగా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో లభించే పసుపు స్వచ్ఛమైనదేనని చెప్పలేం.

పెరుగుతున్న కల్తీ కారణంగా.. పసుపులో తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, రంగులను కలుపుతున్నారు. అందువల్ల ఇంట్లో దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
పసుపు రంగును, మృదువైన ఆకృతికి ఇవ్వడానికి మెటానిల్ యెల్లో, లెడ్ క్రోమేట్ వంటి కృత్రిమ రంగులు, రసాయనాలను తరచుగా కలుపుతారు. కొన్ని సందర్భాల్లో సుద్ద పొడి, అడవి పసుపు, లేదా నాణ్యత లేని ముడి పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. అందుకే పసుపును కొనుగోలు చేసేటప్పుడు కేవలం రంగుపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.
ఎలా తెలుసుకోవాలి?
పసుపు అసలైనదా లేదా నకిలీదా అని కన్ఫామ్ చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం నీటితో పరీక్షించడం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు వేసి కాసేపు అలానే ఉంచండి. ఒకవేళ పసుపు అడుగున పేరుకుపోయి, నీరు లేత పసుపు రంగులోనే ఉంటే.. అది స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. అయితే ఒకవేళ నీరు ముదురు పసుపు రంగులోకి మారి, పసుపు పూర్తిగా కరిగిపోతే, అది కల్తీకి సంకేతం కావచ్చు.
అరచేతి ద్వారా కూడా పసుపు ప్యూరిటీని తెలుసుకోవచ్చు. మీ అరచేతిలో చిటికెడు పసుపును ఉంచి 10 నుండి 20 సెకన్ల పాటు మీ బొటనవేలితో రుద్దండి. ఆ పసుపు అసలైనదైతే.. అది మీ అరచేతిపై లేత పసుపు మరకను కలిగి ఉంటుంది. నకిలీ లేదా అధికంగా కల్తీ చేసిన పసుపు వేరే రంగును ఉంటుంది లేదా త్వరగా రంగు వెలిసిపోతుంది.
పసుపులో మెటానిల్ ఎల్లో వంటి కల్తీ పదార్థాలు ఉన్నాయో లేదో పరీక్షించడానికి, ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా పసుపు పొడి వేసి, కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారితే, పసుపులో మెటానిల్ ఎల్లో కల్తీ జరిగి ఉండవచ్చు. దీనిద్వారా ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వికారం, అజీర్ణం కలగవచ్చు.
పసుపులో కల్తీని పరీక్షించడానికి దానిని నీరు, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలుపుతారు. బుడగలు ఏర్పడితే.. అందులో కల్తీ ఉన్నట్లు అర్థం. రోజూ వాడే మసాలాల మంచివని తెలుసుకోవడం ముఖ్యం. పసుపును తక్కువ పరిమాణంలో వాడినప్పటికీ, కల్తీ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల మార్కెట్లో పసుపు కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన బ్రాండ్‌ను ఎంచుకుని, ఇంట్లో క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఉత్తమం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


