ఈ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటే క్షణంలో ప్రమాదాలు జరగవచ్చు!

కొందరు మహిళలు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు. కానీ వంట చేసేటప్పుడు.. గ్యాస్ స్టవ్ దగ్గర అస్సలు ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటితో ప్రమాదాలు జరగవచ్చు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు.

Published on: May 18, 2026, 16:58:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉదయం నుండి రాత్రి వరకు వంటగదిలోనే ఎక్కువ పని ఉంటుంది. రకరకాల వంటకాలు తయారుచేసే ఈ ప్రదేశం ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరం కూడా. మీ చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా.. గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని వస్తువులను అజాగ్రత్తగా వదిలేస్తే.. అవి క్షణాల్లో మంటలు అంటుకోవచ్చు. అంతేకాదు ప్రమాద తీవ్రత పెరగవచ్చు. అందుకే కొన్ని రకాల వస్తువులను దూరంగా పెట్టాలి.

కిచెన్ చిట్కాలు
కిచెన్ చిట్కాలు

చాలా మంది వంట చేసేటప్పుడు కాగితాలు, బిల్లులు లేదా పుస్తకాలను స్టవ్ దగ్గర ఉంచుతారు. కానీ ఇవి చాలా ప్రమాదకరం. చిన్న మంట కూడా త్వరగా అంటుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ షాపింగ్ తర్వాత మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్లు, కార్డ్‌బోర్డ్ పెట్టెలను కూడా స్టవ్ పక్కన పెట్టకూడదు. ఫ్యాన్ గాలి కారణంగా, అవి మంటకు దగ్గరగా జరిగి ప్రమాదానికి కారణం కావచ్చు.

చాలా మంది పొయ్యి వెలిగించిన తర్వాత లైటర్లు లేదా అగ్గిపెట్టెలను స్టవ్ మీద వదిలేస్తారు. కానీ ఈ వస్తువులు అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. పిల్లలు ఆడుకునేటప్పుడు వాటిని తాకితే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది.

ఈ కాలంలో వందలో 90 మంది వంట చేసేటప్పుడు తమ మొబైల్ ఫోన్లలో మాట్లాడతారు, వాటిని ఛార్జ్ చేస్తారు. కానీ గ్యాస్ స్టవ్ దగ్గర మీ మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడం సురక్షితం కాదు. అంతేకాదు వంట చేస్తూ ఫోన్ మాట్లాడటం కూడా మంచిది కాదు. ప్రమాదం జరిగితే దీని కారణంగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వంటగదిలో ఎక్కడైనా తీగలు వదులుగా ఉన్నా లేదా ఓవెన్ నుండి వింత శబ్దాలు వస్తున్నా.. వెంటనే దాన్ని చెక్ చేయాలి.

వంట చేసేటప్పుడు మీరు ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వదులుగా ఉండే పట్టు, జార్జెట్ లేదా షిఫాన్ వస్త్రాలు అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు.

మీ జుట్టును గట్టిగా కట్టుకోవడం కూడా మంచిది. బట్టలను, వేడి పాత్రలను స్టవ్‌కు దూరంగా ఉంచండి. వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండాలి. వెంటిలేషన్ బాగుండాలి. గ్యాస్ స్టవ్ మీద మండే ఏ వస్తువునూ ఉంచవద్దు. ఇంట్లో ఒక చిన్న అగ్నిమాపక యంత్రాన్ని ఉంచుకోవడం కూడా ఒక మంచిది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More