TTD Admissions 2026 : టీటీడీ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు - ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలివే!
TTD Junior College Admissions 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు జూన్ 3వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TTD Junior College Admissions 2026 : టీటీడీ తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే ” Student Manual in English” or “Student Manual in Telugu” రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేశాక, అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. వాటిలో తమకు కావాల్సిన బాక్స్ లపై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూప్ లలోని సీట్లు, వాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.
విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయిస్తారు. ఆపై విద్యార్థులకు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. అయితే విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది.
విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, కళాశాల ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి పక్కన పెట్టుకుని ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ కోరుతోంది.
విద్యార్థులు దరఖాస్తు నింపు సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

