బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ఫ్యాషన్ సెన్స్‌కు సాటిలేరు. ముఖ్యంగా సంప్రదాయ దుస్తుల్లో ఆమె ఒలికించే గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ 58 ఏళ్ల నటి మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న వేళ, ఫ్యాషన్ ప్రియులకు ఇన్పిరేషన్ ఇచ్చేలా అదిరిపోయే బాటిల్ గ్రీన్ చీరలో ఆమె మెరిసిపోయారు.
అందాల ‘గైడ్’.. క్లాసిక్ లుక్

జనవరి 31న మాధురీ దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. 1965 నాటి క్లాసిక్ సినిమా ‘గైడ్’లోని ‘పియా తోసే నైనా లాగే రే..’ అనే హిట్ సాంగ్‌ను క్యాప్షన్‌గా జోడించి, తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకువచ్చారు. రిచ్ బాటిల్ గ్రీన్ రంగులో ఉన్న ఈ పట్టు చీర ఆమెకు రాజసం తెచ్చిపెట్టింది. చీర అంచు వెంబడి జరిపిన జర్దోసీ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ అవుట్‌ఫిట్‌కు హైలెట్‌గా నిలిచింది.
మాధురీ ఈ చీరను ఎంతో హుందాగా, సాంప్రదాయ పద్ధతిలో కట్టుకున్నారు. పల్లును భుజంపై నుండి జారవిడుస్తూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చీర రంగుకు మ్యాచ్ అయ్యేలా హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను ఆమె ఎంచుకున్నారు. ఇది ఫంక్షన్లలో ధరించడానికి పర్ఫెక్ట్ గ్లామరస్ లుక్‌ను ఇచ్చింది.
ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
మాధురీ ధరించిన ఈ సిల్క్ శారీ ‘జయంతి రెడ్డి’ అనే ఫ్యాషన్ లేబుల్‌కు చెందింది. దీని ధర అక్షరాలా రూ. 1,39,900. ఒకవేళ మీరు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి స్పెషల్ లుక్‌ను ట్రై చేయాలనుకుంటే, ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించాల్సిందే.
యాక్సెసరీస్, మేకప్
తన లుక్‌ను మరింత బ్రైట్ చేయడానికి మాధురి ఎమరాల్డ్ (పచ్చలు) జుంకాలు, కుందన్ గాజును ధరించారు. అలాగే ఒక స్టైలిష్ వాచ్‌తో మోడ్రన్ టచ్ ఇచ్చారు. మేకప్ విషయానికి వస్తే.. స్మోకీ ఐస్, మస్కారా, హైలైటర్, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ఆమె గ్లామర్ రెట్టింపు అయ్యింది. జుట్టును మధ్యలోకి పాపిడి తీసి, సాఫ్ట్ కర్ల్స్‌తో ఫ్రీగా వదిలేయడం ఆమెకు మరింత యంగ్ లుక్‌ను అందించింది.
{{/usCountry}}తన లుక్‌ను మరింత బ్రైట్ చేయడానికి మాధురి ఎమరాల్డ్ (పచ్చలు) జుంకాలు, కుందన్ గాజును ధరించారు. అలాగే ఒక స్టైలిష్ వాచ్‌తో మోడ్రన్ టచ్ ఇచ్చారు. మేకప్ విషయానికి వస్తే.. స్మోకీ ఐస్, మస్కారా, హైలైటర్, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ఆమె గ్లామర్ రెట్టింపు అయ్యింది. జుట్టును మధ్యలోకి పాపిడి తీసి, సాఫ్ట్ కర్ల్స్‌తో ఫ్రీగా వదిలేయడం ఆమెకు మరింత యంగ్ లుక్‌ను అందించింది.
{{/usCountry}}58 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ పాటిస్తూ, నేటి తరం నటీమణులకు పోటీనిస్తున్న మాధురీ స్టైల్ స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.