అందాల వేదికపై కేరళ భామ మెరిసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా ఆదివారం (ఆగస్టు 23) రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' కిరీటాన్ని ముద్దాడారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 52 మంది ప్రతిభావంతులైన సుందరీమణులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించారు. ఈ ఏడాది పోటీల్లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా కాజియా నిలవడం విశేషం.
విజయాన్ని ఖాయం చేసిన ఆ ఒక్క సమాధానం

గ్లామానంద్ గ్రూప్ సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, 'యాక్ట్ నౌ' వ్యవస్థాపకుడు రాజీవ్ కె శ్రీవాస్తవ ఫినాలే రౌండ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "మీ జీవితంలో 'నిశ్శబ్దం' (Sound of silence) కలిగించే అనుభూతిని వివరించగలరా?" అని ప్రశ్నించగా... కాజియా ఇచ్చిన సమాధానం జడ్జీలను మంత్రముగ్ధులను చేసింది.
"నా దృష్టిలో నిశ్శబ్దం అంటే కొద్ది నిమిషాల క్రితం స్టేజ్ పైకి వచ్చే ముందు నేను అనుభవించిన ప్రశాంతతే. నేను ఒక శాస్త్రీయ నర్తకిగా, నటిగా, మోడలింగ్ ప్రేమికురాలిగా స్టేజ్‌పైనే పెరిగాను. మైక్ చేతిలో పట్టుకుని, స్టేజ్ వెలుగుల మధ్య నిలబడటాన్ని ఎంతో ఇష్టపడతాను. వేదికపైకి అడుగుపెట్టే ముందు గుండె లోతుల్లోంచి ఒక ప్రశాంతమైన శ్వాస తీసుకున్నప్పుడు, నా గుండెచప్పుడు నెమ్మదించినప్పుడు కలిగే ఆ అనుభూతియే అసలైన నిశ్శబ్దం. మనం ఉండాల్సిన సరైన స్థానంలో ఉన్నామనే నమ్మకం కలగడమే ఆ నిశ్శబ్దానికి అర్థం." అని కాజియా ఆకట్టుకునేలా సమాధానమిచ్చారు.
90 నిమిషాల్లో 20 ప్రశ్నలు
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా ఫైనలిస్టుల కోసం పోటీ నిర్వాహకులు కఠినమైన పరీక్ష పెట్టారు. 90 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చింది. ఆధునిక భారత్‌ను ఎలా నిర్వచిస్తారు? అందాల పోటీలు నిజంగానే స్త్రీవాదానికి సంకేతమా? అందాల భామలు వాతావరణ మార్పులపై అవగాహన పెంచగలరా? మీకు ఇష్టమైన మిస్ యూనివర్స్ ఇండియా ఎవరు? వంటి అంశాలపై పోటీదారులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా పంచుకున్నారు.
ఎవరీ కాజియా లిజ్ మెజో?
19 ఏళ్ల కాజియా ప్రస్తుతం లా (న్యాయశాస్త్రం) చదువుతున్నారు. శాస్త్రీయ నర్తకిగా, నటిగా, వక్తగా (Public Speaker) ఆమెకు మంచి గుర్తింపు ఉంది. 'మిస్ యూనివర్స్ కేరళ'గా ఎంపికైన ఆమె, ఆ తర్వాత జాతీయ వేదికపై ప్రతిభ చాటి 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' విజేతగా నిలిచారు.
{{/usCountry}}19 ఏళ్ల కాజియా ప్రస్తుతం లా (న్యాయశాస్త్రం) చదువుతున్నారు. శాస్త్రీయ నర్తకిగా, నటిగా, వక్తగా (Public Speaker) ఆమెకు మంచి గుర్తింపు ఉంది. 'మిస్ యూనివర్స్ కేరళ'గా ఎంపికైన ఆమె, ఆ తర్వాత జాతీయ వేదికపై ప్రతిభ చాటి 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' విజేతగా నిలిచారు.
{{/usCountry}}"నా దృష్టిలో నిజమైన అందం అంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం. ప్రతి ఓటమి నుంచి మళ్లీ మళ్లీ లేచి నిలబడటమే అసలైన అందం. భయం, వైఫల్యం, బలహీనతలను జయించి మనసులో ఆశల జ్వాలను రగిలించడమే ధైర్యం. ప్రశాంతతతో నడిపిస్తూ, మన అంతర్‌జ్ఞానంతో మాట్లాడుతూ, మనం వెళ్లే ప్రతి ప్రాంతాన్ని, కలిసే ప్రతి మనిషిని మరింత మెరుగ్గా మార్చడమే అందానికి నిజమైన నిర్వచనం" అని కాజియా తన ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.