Mango Tomato Recipe : నోరూరించే మామిడి, టమోట తొక్కు.. పది నిమిషాల్లో ఈజీగా చేసే రెసిపీ
Mango Tomato Recipe : ఇంట్లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలా? అయితే మీ కోసం మామిడి, టమోట తొక్కు రెసిపీ ఉంది. దీనిని సింపుల్‌గా తయారు చేయవచ్చు.
ప్రతి రోజూ మీ టిఫిన్‌కు ఏ సైడ్ డిష్ చేయాలో ఆలోచించి.. ఆలోచించి బుర్ర పాడవుతుందా? మీ ఇంట్లో ఉదయం ఎక్కువగా ఇడ్లీ, దోసెలే చేస్తారా? అయితే ఈ ఇడ్లీ, దోసెల కోసం ఎప్పుడూ సాంబార్, చట్నీ తినే బదులుగా మామిడి కాయతో కొత్త రకం రెసిపీ చేసుకోండి. దీనిని అన్నంలోకి కూడా తినవచ్చు.

ఇప్పుడు మామిడి పండ్ల సీజన్.. సో.. ఈ సీజన్‌లో మామిడిని వండి తినడానికి వీలైనన్ని రకాలు ప్రయత్నించి చూడండి. మీ ఇంట్లో మామిడి పండ్లు, టమాటాలు ఉంటే, వాటితో ఒక రుచికరమైన తొక్కు చేసుకోండి. ఈ మామిడి టమాటా ధోక్కు ఇడ్లీ, దోసలతోనే కాకుండా చపాతీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అన్నంతో పాటు సైడ్ డిష్‌గా కూడా తినవచ్చు. మీరు ఈ తొక్కును ఒక్కసారి తయారు చేస్తే.. ఇంట్లో వాళ్ళు మళ్లీ.. మళ్లీ చేయమంటారు.
మామిడి టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఈజీగా చేసేందుకు ఎలా చేయాలో కింద అందించాం.
కావాల్సిన పదార్థాలు
మామిడి - 1, టమాటా - 3, వెల్లుల్లి - 10 రెబ్బలు, పచ్చిమిర్చి - 1, నూనె - 1 1/2 టేబుల్ స్పూన్లు, పెద్ద ఉల్లిపాయ - 1, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, కాశ్మీరీ కారం - 1 టీ స్పూన్.
తయారు చేసే విధానం
- మెుదట మామిడి పండును తీసుకుని కొన్ని ముక్కలుగా కోయండి. తర్వాత టమాటోను రెండు ముక్కలుగా కోయండి.
- ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి, అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయండి. అందులో మామిడి, టమాటో, వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి వేసి, మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించండి.
- రెండు నిమిషాల తర్వాత మూత తీసి, మామిడి, టమాటోలను తిప్పి, మళ్ళీ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించండి.
- మామిడి, టమాటోలు బాగా ఉడికిన తర్వాత, వాటిని తీసి చల్లారనివ్వండి.
- తర్వాత, టమాటో తొక్క తీసి, వెల్లుల్లి, పచ్చిమిర్చితో పాటు మిక్సర్ జార్‌లో వేయండి.
- ఆ తర్వాత మామిడి పండులోని గుజ్జును గరిటెతో తీసుకుని దాన్ని కూడా జార్‌లో వేయండి.
- తర్వాత అందులో తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ కారం వేసి మెత్తగా రుబ్బుకోండి.
- అంతే పదే పది నిమిషాల్లో రుచికరమైన మామిడి టమాటో తొక్కు రెడీ.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


