తండ్రి గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. బ్రేకప్ చేయించిన కూతురు

తండ్రి ఓ యువతితో డేటింగ్ చేయడం, ఆమె తమ ఇంట్లో తనపై, తన చెల్లెలిపై ఆధిపత్యం చలాయించడం ఒక కూతురికి నచ్చలేదు. చివరకు వారిద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్‌కు దారితీసింది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Feb 23, 2026 11:36 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తల్లిదండ్రులు తమకంటే చాలా తక్కువ వయసు ఉన్నవారితో డేటింగ్ చేసినప్పుడు, పిల్లలతో పొత్తు కుదరడం కాస్త కష్టమే. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక ఇంట్లో చిచ్చు రేపింది. తన తండ్రి ప్రేమించిన యువతి, తమ వ్యక్తిగత విషయాల్లో, వేసుకునే బట్టల విషయంలో మితిమీరి జోక్యం చేసుకోవడంతో ఓ 23 ఏళ్ల యువతి సహనం కోల్పోయింది. చివరకు తండ్రికి అల్టిమేటం ఇచ్చి మరీ ఆ బంధాన్ని తెగతెంపులు చేయించింది.

కుటుంబ వివాదం (ప్రతీకాత్మక చిత్రం) (Pinterest)
కుటుంబ వివాదం (ప్రతీకాత్మక చిత్రం) (Pinterest)

అసలేం జరిగింది?

ఈ కథనంలోని యువతి (23), ఆమె చెల్లెలు (16) తమ తండ్రి (47)తో కలిసి ఉంటున్నారు. తండ్రి గత ఆరు నెలలుగా 'యాష్లే' అనే 28 ఏళ్ల యువతితో డేటింగ్ చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే ఆమెను తన కూతుళ్లకు పరిచయం చేశాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, మెల్లగా యాష్లే అసలు స్వరూపం బయటపడింది.

"సేవ చేయాలి.. బట్టలు ఉతకాలి"

హిస్పానిక్ సంస్కృతిలో పెరిగిన ఆ యువతికి తన తండ్రి పట్ల ఎంతో గౌరవం ఉంది. అయితే, యాష్లే మాత్రం ఆమెను తండ్రికి 'సేవ' చేయాలని, ఇంట్లో అందరి బట్టలు ఆమె ఒక్కతే ఉతకాలని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. "నువ్వు ఒక్కదానివే నీ బట్టలు ఉతుక్కోవడం స్వార్థం" అంటూ సదరు యువతిని వేధించేది. అంతేకాకుండా, "పిల్లలు ఇంకా తండ్రి ఇంట్లోనే ఎందుకు ఉంటున్నారు? బయటకు వెళ్లలేదా?" అంటూ వారి ఉనికినే ప్రశ్నించడం మొదలుపెట్టింది.

"పాపి" అని పిలవొద్దు

తండ్రిని ఆ యువతి ప్రేమగా "పాపి" (Papi) అని పిలిచేది. అయితే, దానికి లైంగిక అర్థం ఉంటుందని, ఆ వయసులో అలా పిలవడం సరికాదని యాష్లే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చెల్లెలు కూడా స్పందిస్తూ.. అది తమ సంస్కృతిలో భాగమని వివరించినా యాష్లే వినలేదు.

పరాకాష్టకు చేరిన గొడవ

ఒకరోజు తండ్రి, యాష్లే డేటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంట్లో టీషర్ట్, షార్ట్స్ వంటి సాధారణ దుస్తుల్లో ఉన్నారు. దీనిపై యాష్లే మండిపడింది. "తండ్రి ముందు ఇలాంటి బట్టలు వేసుకోవడానికి సిగ్గుగా లేదా? మీరు అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నారు" అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఆ యువతికి కోపం కట్టలు తెంచుకుంది. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య భౌతిక దాడికి దారితీసింది. "నాకు ఆమె వద్దు.. మేం కావాలా? ఆమె కావాలా?" అంటూ తండ్రికి అల్టిమేటం ఇచ్చింది. చివరకు తండ్రి ఆమెను ఇంటి నుంచి పంపేసి బ్రేకప్ చెప్పాడు. కానీ, చనిపోయిన తల్లి ప్రస్తావన తేవడం, చేయి చేసుకోవడం ఆ యువతిని ఇప్పుడు బాధపెడుతోంది.

నెటిజన్ల మద్దతు

ఈ కథనాన్ని ఆమె రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకోగా, నెటిజన్లు ఆమెకే మద్దతు తెలుపుతున్నారు.

"నీకంటే కేవలం ఐదేళ్లు పెద్దదైన ఆమె, నిన్ను కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు" అని ఒకరు రాశారు.

"ఆమె మిమ్మల్ని ఇంటి నుంచి పంపేసి, ఆ ఇంటిని ఆక్రమించాలని చూస్తోంది" అని మరొకరు విశ్లేషించారు.

"నీ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తితో బంధం కొనసాగించడం ప్రమాదకరం" అంటూ మరికొందరు ఆమెను ఓదార్చారు.