అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ ఈ హీరోతోనే.. క్యూట్ సెల్ఫీతో కన్ఫమ్ అయిందంటున్న ఫ్యాన్స్.. ఆ స్టార్ హీరో కొడుకే బాయ్‌ఫ్రెండ్

తమిళ సినిమా 'బైసన్ కాలమాడన్' (Bison Kaalamaadan)లో జంటగా నటించిన అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవాల్లో వీరిద్దరూ కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు.

Feb 19, 2026, 15:59:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బైసన్ కాలమాడన్' (Bison Kaalamaadan) సినిమాలో నటించడానికి ముందే.. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వీరిద్దరూ స్పాటిఫై లిస్ట్‌ను షేర్ చేసుకోవడం, ఒక అన్‌వెరిఫైడ్ లిప్-లాక్ సెల్ఫీ బయటకు రావడం వంటివి ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. అయితే దీనిపై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇటీవల కొన్ని అవార్డుల ఫంక్షన్స్‌లో వీరు కలిసి కనిపించడంతో.. అభిమానులు వీరు కచ్చితంగా డేటింగ్‌లో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు.

అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ ఈ హీరోతోనే.. క్యూట్ సెల్ఫీతో కన్ఫమ్ అయిందంటున్న ఫ్యాన్స్.. ఆ స్టార్ హీరో కొడుకే బాయ్‌ఫ్రెండ్
అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ ఈ హీరోతోనే.. క్యూట్ సెల్ఫీతో కన్ఫమ్ అయిందంటున్న ఫ్యాన్స్.. ఆ స్టార్ హీరో కొడుకే బాయ్‌ఫ్రెండ్

అవార్డ్ షోలలో సందడి.. వైరల్ అవుతున్న క్యూట్ సెల్ఫీ

ముంబైలో జరిగిన 'టీహెచ్ఆర్ ఇండియాస్ ది ఆనర్స్' అవార్డ్స్ ఫంక్షన్‌కు ధ్రువ్, అనుపమ, బైసన్ టీమ్ కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో తమ టీమ్ అవార్డులు గెలుచుకోవడంతో, ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అవార్డ్స్ నైట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ముఖ్యంగా ధ్రువ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక క్యూట్ సెల్ఫీని, అనుపమ 'హార్ట్ ఎమోజీ'తో రీ-షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతేకాకుండా చెన్నైలో జరిగిన ‘జేఎఫ్‌డబ్ల్యూ అవార్డ్స్’లో కూడా ఈ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక్కడ కూడా వారు అవార్డులు గెలుచుకున్నారు. కాగా స్టేజ్‌పై ధ్రువ్ విక్రమ్.. అనుపమకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగానే ఆమె సిగ్గుపడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా "రాత్రి 2 గంటలకు ఎవరికి కాల్ చేస్తారు?" అని అనుపమను అడిగినప్పుడు.. "నేను బహుశా ధ్రువ్‌కి కాల్ చేస్తాను" అని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం.

ఫ్యాన్స్ రియాక్షన్.. "ఇది కన్ఫమ్ లే.."

ఈ అవార్డ్స్ ఫంక్షన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసిన అభిమానులు.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. "ధ్రువ్, అనుపమ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది" అని ఎక్స్ లో ఒకరు కామెంట్ చేశారు.

"వీరిద్దరూ కలిసి ఉండటానికి అర్హులు.. నైస్ కపుల్" అని మరొకరు రాసుకొచ్చారు. స్టేజ్‌పై ధ్రువ్ బర్త్‌డే విషెస్ చెబుతున్న వీడియోను చూసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. "కన్ఫమ్ లే" అని స్పందించాడు. "ఇక్కడ ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు కదా" అని ఒకరు.. "అతను హ్యాపీ బర్త్‌డే అంటే.. ఆమె ఐ లవ్ యూ అన్నట్లుగా విన్నదేమో" అంటూ అనుపమ ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసి నెటిజన్లు సరదాగా జోకులు పేలుస్తున్నారు.

అనుపమ, ధృవ్ కెరీర్ ఇలా..

సినిమాల విషయానికొస్తే.. 2025లో అనుపమ ఫుల్ బిజీగా గడిపింది. తమిళంలో డ్రాగన్, బైసన్ కాలమాడన్.. మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, అలాగే తెలుగులో పరదా, కిష్కింధపురి వంటి సినిమాల్లో ఆమె నటించింది. ఈ ఏడాది తమిళ సినిమా ‘లాక్‌డౌన్’లో కూడా ఆమె కనిపించింది.

మరోవైపు 2019లో వచ్చిన 'ఆదిత్య వర్మ' (అర్జున్ రెడ్డి రీమేక్), 2022లో 'మహాన్' సినిమాలతో మెప్పించిన ధ్రువ్ విక్రమ్.. 2025లో వచ్చిన 'బైసన్ కాలమాడన్' సినిమానే తన అసలైన డెబ్యూగా భావిస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ధృవ్ ఎవరో తెలుసా.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More