ఫిట్‌నెస్ ప్రియులకు సంజీవ్ కపూర్ బంపర్ ఆఫర్: రుచికరమైన ‘వెజ్ ప్రోటీన్ బౌల్’ రెసిపీ మీకోసం
జిమ్‌కి వెళ్లేవారికైనా, బరువు తగ్గాలనుకునే వారికైనా ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ అందించిన ఈ వెజిటేరియన్ ప్రోటీన్ బౌల్ అటు ఆరోగ్యాన్ని, ఇటు రుచిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం ఇక్కడ ఉంది.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే చప్పగా ఉంటుందని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా శాకాహారులకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే, అదే సమయంలో రుచిగా ఉండే వంటకాలు దొరకడం కాస్త కష్టమే. అయితే, ఈ సమస్యకు ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. తన ‘సంజీవ్ కపూర్ ఖజానా’ యూట్యూబ్ ఛానెల్‌లో ఆయన పోస్ట్ చేసిన ‘సిగ్నేచర్ ప్రోటీన్ బౌల్’ ఇప్పుడు ఫిట్‌నెస్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

బ్రౌన్ రైస్, గ్రిల్డ్ పనీర్, పోషకాలతో నిండిన కూరగాయల కలయికతో రూపొందించిన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
గ్రిల్డ్ పనీర్ కోసం:
- పనీర్ (చిక్కటి ముక్కలుగా కోసినవి): 200 గ్రాములు
- వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, చిల్లీ ఫ్లేక్స్: ఒక్కోటి అర టీస్పూన్
- ఎండిన మిక్స్‌డ్ హెర్బ్స్: అర టీస్పూన్
- నిమ్మరసం: ముప్పావు టీస్పూన్
- ఆలివ్ ఆయిల్: 2 టీస్పూన్లు
- ఉప్పు: రుచికి సరిపడా
హెర్బ్‌డ్ రైస్ కోసం:
- ఉడికించిన బ్రౌన్ రైస్: అర కప్పు
- ఆలివ్ ఆయిల్: అర టేబుల్ స్పూన్
- సన్నగా తరిగిన వెల్లుల్లి: అర టేబుల్ స్పూన్
- పుదీనా, కొత్తిమీర తరుగు: అర టేబుల్ స్పూన్
కూరగాయల మిశ్రమం (Sauteed Veggies):
- బ్రోకలీ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, రంగు రంగుల క్యాప్సికమ్ ముక్కలు
- మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 3-4
తయారీ విధానం - స్టెప్ బై స్టెప్
1. పనీర్ మ్యా రినేషన్:
ముందుగా పనీర్ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. పైన చెప్పిన వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, నిమ్మరసం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించండి. దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
2. హెర్బ్‌డ్ రైస్ తయారీ:
ఒక పాన్ వేడి చేసి ఆలివ్ ఆయిల్ వేయండి. అందులో వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత, చిల్లీ ఫ్లేక్స్, పుదీనా, కొత్తిమీర వేసి కలపండి. ఇప్పుడు ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి, కొద్దిగా నీళ్లు చల్లి, మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి.
3. కూరగాయల వేపుడు:
మరో పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లిని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించండి. అందులో మష్రూమ్స్ వేసి 2 నిమిషాలు వేయించాక.. బ్రోకలీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి. చివరగా ఉప్పు, హెర్బ్స్ వేసి మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి.
4. పనీర్ గ్రిల్లింగ్:
గ్రిల్ పాన్ వేడి చేసి పనీర్ ముక్కలను రెండు వైపులా ఒక్కో నిమిషం పాటు ఎర్రగా వచ్చేలా కాల్చండి.
5. సలాడ్ & డ్రెస్సింగ్:
ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, తేనె, మస్టర్డ్ పేస్ట్ (ఆవాల పేస్ట్), ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇందులో చెర్రీ టొమాటోలు, దోసకాయ ముక్కలు, లెట్యూస్ ఆకులు వేసి మిక్స్ చేయండి.
"ప్రతి పదార్ధానికి విడివిడిగా మసాలాలు జోడించడం వల్ల ప్రతి ముక్కలోనూ అద్భుతమైన రుచి తెలుస్తుంది" అని సంజీవ్ కపూర్ పేర్కొన్నారు.
ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఒకవైపు రైస్, మరోవైపు వేయించిన కూరగాయలు, సలాడ్ ఉంచండి. పైన గ్రిల్ చేసిన పనీర్ ముక్కలను అమర్చి సర్వ్ చేయండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


