రోజుకు 3 గంటల పఠనం, ప్రత్యేక పూజలు: శోభిత ఆధ్యాత్మిక జీవనశైలి రహస్యాలు

గ్లామరస్ నటి శోభిత ధూళిపాళ్ల తన వ్యక్తిగత అలవాట్లు, ఆధ్యాత్మిక జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోజుకు మూడు గంటల పుస్తక పఠనం, ఇంట్లో ప్రత్యేక పూజా మందిరం, పౌర్ణమి గమనాలను గమనించడం తన మానసిక ప్రశాంతతకు కారణమని తెలిపారు.

Published on: Aug 25, 2026, 17:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన శైలితో ఆకట్టుకునే నటి శోభిత ధూళిపాళ్ల వ్యక్తిగత జీవితంలో అత్యంత ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటారు. తాజాగా 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగం గురించి, మానసిక ఆరోగ్యం కోసం పాటించే ప్రత్యేక అలవాట్ల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

రోజుకు 3 గంటల పఠనం, ప్రత్యేక పూజలు: శోభిత ఆధ్యాత్మిక జీవనశైలి రహస్యాలు
రోజుకు 3 గంటల పఠనం, ప్రత్యేక పూజలు: శోభిత ఆధ్యాత్మిక జీవనశైలి రహస్యాలు

రోజుకు 3 గంటల పఠనం.. ఇ-బుక్స్‌కు స్వస్తి

సోషల్ మీడియా రీల్స్, డిజిటల్ స్క్రీన్‌ల దాడి ఎక్కువైన ఈ కాలంలోనూ శోభిత రోజుకు ఏకంగా మూడు గంటలు పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నారు. ఫిజికల్ పుస్తకాలు (Paperbacks), సబ్‌స్టాక్ ఆర్టికల్స్ చదవడం ఆమె దినచర్యలో భాగం. ఐప్యాడ్ లేదా కిండిల్ వంటి డిజిటల్ పరికరాల్లో చదవడానికి ఆమె సుముఖంగా లేరు.

"పుస్తక పేజీలను తిప్పుతూ చదవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కిండిల్ వాడే ప్రసక్తే లేదు" అని శోభిత స్పష్టం చేశారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఎండలో గడపడం ఎంత ముఖ్యమో.. పుస్తక పఠనం కూడా తన మానసిక ఆరోగ్యానికి అంతే కీలకమని చెప్పారు.

ట్రాఫిక్ జామ్‌లోనే ధ్యానం

సాధారణంగా నగరాల్లో ట్రాఫిక్ ఎదురైతే ఎవరికైనా చిరాకు వస్తుంది. కానీ శోభిత ఆ సమయాన్ని ఒక మెడిటేషన్‌లా మార్చుకుంటారు. కారు కిటికీలోంచి బయటకు చూస్తూ కలలు కనడం, ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడం ప్రయాణాల్లోనే సాధ్యమవుతుందని వివరించారు. విమాన ప్రయాణాలు కూడా తనలోని భావోద్వేగాలను రీసెట్ చేసేందుకు ఎంతో దోహదపడతాయని శోభిత తెలిపారు.

'ఆస్ట్రో-గీక్'.. ఇంట్లో ప్రత్యేక పూజా మందిరం

సినిమా రంగుల ప్రపంచానికి దూరంగా తనలో ఒక లోతైన ఆధ్యాత్మిక కోణం ఉందని శోభిత వెల్లడించారు. "అంతర్లీనంగా ఉండే శక్తిపై నాకు అపారమైన విశ్వాసం ఉంది. పౌర్ణమి రోజుల్లో నా మానసిక స్థితి ఎలా ఉందో, చంద్రుడి పరిణామక్రమానికి అనుగుణంగా నాలో వచ్చే మార్పులను నిశితంగా గమనిస్తుంటాను. నేను ఒక 'ఆస్ట్రో-గీక్'. నా ఇంట్లో ఒక ప్రత్యేక పూజా మందిరం ఉంది. అక్కడ ప్రశాంతంగా సమయం గడుపుతాను" అని తెలిపారు.

ఏకాంతాన్ని కోరుకునే తత్వం

తనని తాను ఒక ఏకాంతజీవిగా శోభిత అభివర్ణించుకున్నారు. స్వయంసమృద్ధి, సొంత సరిహద్దులు కలిగి ఉండటం తన నైజమని చెప్పారు. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన అంతరంగంతో గడపడానికి, స్వీయ సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని ముగించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More