Sobhita Dhulipala: కమ్యూనిజం గెలుస్తుందంటూ శోభిత షాకింగ్ కామెంట్స్.. అక్కినేని ఆస్తులు పంచేస్తారా అంటూ ట్రోల్స్
Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ షాకింగ్ పొలిటికల్ కామెంట్స్ చేసింది. ఏదో ఒక రోజు కమ్యూనిజం గెలుస్తుందని ఆమె అనడం గమనార్హం. ఆమె చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అన్ని కోట్లు ఎలా సంపాదించావంటూ ప్రశ్నిస్తున్నారు.
Sobhita Dhulipala: "కమ్యూనిజం ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది" అంటూ ప్రముఖ నటి, అక్కినేని ఇంటి కోడలు శోభిత ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద వివాదంగా మారాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, వేల కోట్ల ఆస్తులున్న కుటుంబానికి కోడలిగా వెళ్లి ఇలాంటి డొల్ల సిద్ధాంతాలు మాట్లాడటం ఏంటని నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శోభిత తన పర్సనల్ భావాలను పంచుకుంటూ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ బయటకు రాగానే ఎక్స్ వేదికగా నెటిజన్లు ఆమె వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నారు.
శోభిత పొలిటికల్ సీక్రెట్ ఇదే..
శోభిత ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మీ గురించి ఓ సీక్రెట్ చెప్పమని యాంకర్ అడిగినప్పుడు.. తనకు కచ్చితమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయని, తాను లెఫ్ట్ లిబరల్ అని వెల్లడించింది. అంతేకాదు ఏదో ఒకరోజు కమ్యూనిజం గెలుస్తుందని అనడం గమనార్హం. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయ్యాయి.
రూ.3,500 కోట్ల ఆస్తులు పేదలకు పంచేస్తారా?
శోభిత కామెంట్స్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు విసురుతున్నారు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కుటుంబం నెట్ వర్త్ దాదాపు రూ.3,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
"కమ్యూనిజం గెలవాలని కోరుకుంటున్న శోభిత.. తన మామ నాగార్జున, భర్త నాగ చైతన్యకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, లగ్జరీ కార్లు, ఇతర ఆస్తులను పేదలకు సమానంగా పంచేందుకు రెడీగా ఉన్నారా?" అని నెటిజన్లు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. సొంత డబ్బును పంచిపెట్టనంత వరకు ఇలాంటి సామ్యవాద సిద్ధాంతాలు మాట్లాడటం చాలా ఈజీ అని సెటైర్లు వేస్తున్నారు.
కేపిటలిజం ఫలాలు అనుభవిస్తూ కమ్యూనిజం ప్రచారమా?
సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మ్యాగజైన్ కవర్ షూట్‌ల ద్వారా శోభిత దాదాపు రూ.15 నుంచి 20 కోట్లు సంపాదించారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. క్యాపిటలిజం వల్లే ఆమెకు ఈ స్థాయిలో డబ్బు, లగ్జరీ లైఫ్‌స్టైల్ సాధ్యమయ్యాయని స్పష్టం చేస్తున్నారు.
"లెఫ్ట్ లిబరల్స్ ఎప్పుడూ క్యాపిటలిజం అందించే సదుపాయాలను అనుభవిస్తూనే కమ్యూనిజం సిద్ధాంతాలను రోమాంటిసైజ్ చేస్తారు" అని ఆరోపిస్తున్నారు. ఇతరుల కష్టార్జితాన్ని పంచాలని కోరుకునే వారు తమ సొంత ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
గూఢచారి నుంచి అక్కినేని ఇంటి కోడలి వరకు..
ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ మోడలింగ్ రంగం నుంచి వచ్చి బాలీవుడ్, టాలీవుడ్‌లలో తనదైన ముద్ర వేసింది. 'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్', 'పొన్నియిన్ సెల్వన్', హాలీవుడ్ మూవీ 'మంకీ మేన్' వంటి ప్రాజెక్ట్‌లతో ఆమె గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
గతేడాది డిసెంబర్‌లో అక్కినేని హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుని ఆమె అక్కినేని వారి ఇంట అడుగుపెట్టింది. ఒకవైపు కెరీర్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద రాజకీయ కామెంట్స్ చేసి ట్రోలింగ్ బారిన పడటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


