sobhita dhulipala: శిల్పం ప్రాణం పోసుకుందా? ర్యాంప్‌పై అప్సరసలా శోభిత ధూళిపాళ.. అక్కినేని కోడలు వీడియో వైరల్
sobhita dhulipala: చూపు తిప్పుకోనివ్వని అందం.. రెప్పవేయనివ్వని సొగసుతో శోభిత ధూళిపాళ అదరగొట్టింది. ర్యాంప్ పై అప్సరసలా మెరిసిపోయింది. ఈ అక్కినేని కోడలు తాజా ర్యాంప్ వాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో తెగ వైరల్ గా మారింది.
sobhita dhulipala: దేవాలయాల మీద ఉండే శిల్పం ప్రాణం పోసుకుందా? దివి నుంచి దిగి వచ్చిన అప్సరస ర్యాంప్ పై నడిచిందా?.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ వీడియో చూస్తే ఇలాంటి ప్రశ్నలే కలుగుతున్నాయి. ర్యాంప్ పై అప్సరసలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

షో స్టాపర్ గా శోభిత
ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే 'ఇండియా కౌచర్ వీక్' (FDCI India Couture Week) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్యారిస్ కౌచర్ వీక్‌లో సంచలనం సృష్టించిన తన 'దేవి' (Devi) కలెక్షన్‌ను, దానికి తోడు సరికొత్త ఫెస్టివ్ కౌచర్ లైన్‌ను డిజైనర్ రాహుల్ మిశ్రా ఢిల్లీ వేదికగా ఆవిష్కరించారు. 'నెక్సస్ న్యూయార్క్' కొలాబరేషన్‌తో జరిగిన ఈ షోలో ప్రముఖ నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) షో స్టాపర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
శోభిత విజువల్ వండర్
ర్యాంప్‌పై ఎంట్రీ ఇస్తూనే శోభిత ధూళిపాళ తన రాయల్ లుక్‌తో ఆకట్టుకుంది. ముందుగా ఐవరీ, షాంపైన్ టోన్‌లతో కూడిన ఎంబ్రాయిడరీ ప్యాంట్లు, చిన్న క్రిస్టల్ బీడ్‌వర్క్‌తో డిజైన్ చేసిన ఫిట్టెడ్ బోడిస్‌ను ధరించి అప్సరస విగ్రహంలా మెరిసిపోయింది.
ఆ తర్వాత అదే ర్యాంప్‌పై పూల ఆకృతులతో మెరిసే వాల్యూమినస్ లెహంగా స్కర్ట్‌ను ఆ ప్యాంట్‌పై ధరించి కౌచర్‌లోని సరికొత్త ప్రయోగాన్ని ప్రదర్శించింది. సెంటర్ పార్టెడ్ హెయిర్‌స్టైల్, డైమండ్ చోకర్‌తో శోభిత ధూళిపాళ ప్రదర్శించిన థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఫ్యాషన్ లవర్స్‌ను కట్టిపడేసింది.
వీడియో వైరల్
ర్యాంప్ పై దేవతా విగ్రహంలా నిలబడ్డ శోభిత ధూళిపాళ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ర్యాంప్ పై ఆమె నడక అచ్చం అప్సరసనే తలపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్ తో శోభిత తన సత్తాచాటిందని అందరూ అంటున్నారు.
అక్కినేని కోడలు
తెలుగు, హిందీ సినిమాల్లో యాక్టింగ్ తో అదరగొడుతున్న శోభిత ధూళిపాళ అక్కినేని కోడలిగా మారిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటించిన సినిమా ‘చీకటిలో’ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో శోభిత ధూళిపాళ ఫ్యాన్స్ ను అలరించింది. మంకీ మ్యాన్ అని హాలీవుడ్ లోనూ ఓ ఫిల్మ్ చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


