Sobhita Cook: పెళ్లైన రెండేళ్లకు నా భార్య నాకోసం వంట చేసింది, ఏదో మంచి పనే చేసుంటా.. శోభిత ధూళిపాళపై నాగ చైతన్య పోస్ట్
Naga Chaitanya Sobhita Dhulipala Cooking Dinner: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల జంట నెట్టింట సరికొత్త సందడి చేస్తోంది. పెళ్లయిన రెండేళ్లకు తన భార్య శోభిత తొలిసారిగా స్వయంగా వంట చేసి డిన్నర్ వడ్డించిందని చైతూ పెట్టిన సరదా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Naga Chaitanya Post On Sobhita Dhulipala Cooking Dinner: అక్కినేని ఇంట సరదా ముచ్చట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి. యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి దాదాపు రెండేళ్లు కాబోతోంది. ఈ నేపథ్యంలో శోభిత తన భర్త కోసం తొలిసారి స్వయంగా వంట చేసి డిన్నర్ సిద్ధం చేసింది.

'నన్ను పొగుడుతున్నావా.. లేక ట్రోల్ చేస్తున్నావా?'
ఈ ముచ్చటైన క్షణాన్ని నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అక్కినేని అభిమానులు నెట్టింట తెగ సంబరపడిపోతున్నారు. ఈ పోస్ట్‌లో శోభిత రెండు గిన్నెలతో రాత్రి భోజనం పట్టుకుని ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. క్యాజువల్ దుస్తుల్లో సాధారణంగా కనిపించిన ఆమె రూపాన్ని చూసి చైతూ పెట్టిన క్యాప్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
"పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం రాత్రి భోజనం తయారు చేసింది. ఈ రోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను" అని నాగ చైతన్య చమత్కరించారు.
ఈ పోస్ట్‌కు శోభిత వెంటనే స్పందిస్తూ.. "నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా లేక పొగుడుతున్నావా?" అని సరదాగా కామెంట్ చేసింది. ఈ దంపతుల మధ్య ఉన్న సరదా సంభాషణ నెటిజన్లకు భలే ముచ్చటగొల్పేలా ఉంది.
'బేసిక్ హ్యూమన్ స్కిల్స్' గొడవ వెనుక అసలు కథ!
ఈ సరదా కౌంటర్ల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 2025 మార్చి నెలలో ఒక ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పాల్గొన్నప్పుడు, ఇద్దరిలో ఎవరికి బాగా వంట వచ్చు అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా చైతూ సరదాగా సెటైర్లు వేశారు.
ప్రతిరోజూ రాత్రి శోభితకు హాట్ చాక్లెట్ చేసి ఇస్తానని చైతూ చెప్పగా.. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన 'ప్రాథమిక నైపుణ్యం' (Basic Human Skills) అని, అది కూడా శోభితకు లేదని సరదాగా ఆరోపించారు.
దానికి సమాధానంగా గతేడాది ఓ షూటింగ్ సెట్‌లో శోభిత బెండకాయలు కోస్తూ, పప్పు చేస్తూ ఫొటోలు షేర్ చేసి హ్యాష్ ట్యాగ్‌తో చైతూకు రీ-కౌంటర్ ఇచ్చింది. అప్పట్లో "నీ చేతి వంట రుచి చూడటానికి వేచి చూస్తున్నా" అని చైతూ కామెంట్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిరీక్షణ ఫలించి, శోభిత చేతి వంట రుచి చూసే అవకాశం చైతూకు దక్కింది.
ప్రేమ, పెళ్లి.. సినిమాల విషయానికి వస్తే!
సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య, శోభిత ధూళిపాళల మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం గోప్యంగా ఉన్న వీరి బంధం, 2024 ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థంతో అధికారికంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా చైతూ, శోభిత వివాహం చేసుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శోభిత ఇటీవలే 'చీకటిలో' అనే ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా 'వెట్టువం'లో కీలక పాత్ర పోషిస్తోంది శోభితా ధూళిపాళ.
నాగ చైతన్య వృషకర్మ
ఇక నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే భారీ మైథాలాజికల్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


