bathukamma uyyala songs lyrics : తంగేడు చెట్టు నవ్వి పూచెనయా.. ఉయ్యాల.. బతుకమ్మ పాట లిరిక్స్
bathukamma uyyala songs lyrics : తెలంగాణలో బతుకమ్మ సందడి మెుదలవుతోంది. బతుకమ్మ ఆడే సందర్బంగా ఉయ్యాల పాటలకు ఉండే ప్రత్యేకత వేరు. మీకో HT Telugu ఒక ఉయ్యాల పాట లిరిక్స్ సేకరించింది.
సింగార పల్లెల్లో సంతోషమాయెనే... ఉయ్యాల ||

తొలకరి వానలు పారిన వేళనా... ఉయ్యాల
చెరువుల లోపల నీళ్లు నిండేనయా... ఉయ్యాల
పచ్చని చేలల్ల పైర్లు ఊగంగా... ఉయ్యాల
తంగేడు చెట్టు నవ్వి పూచెనయా... ఉయ్యాల ||
అక్కా చెల్లెళ్లు అందరూ రారండి... ఉయ్యాల
అల్లిబిల్లిగ పూలు ఏరుకొద్దాము... ఉయ్యాల
పచ్చని గునుగు పూలు దోసిళ్ల పడగా... ఉయ్యాల
గుమ్మడి పూలలోన గౌరమ్మ నిలవగా... ఉయ్యాల ||
తామర పూలన్నీ తారలై నిలవగా... ఉయ్యాల
కాటుక పూలల్ల కాంతి చిందేనయా... ఉయ్యాల
రుద్రాక్ష పూలన్నీ హారాలాయెనయా... ఉయ్యాల
దంతెన పూలతో దారింత సువాసన... ఉయ్యాల ||
రంగు రంగుల పూలు రాశిగా పోసి... ఉయ్యాల
ఇత్తడి తాంబాలం ఎంతో సింగారించి... ఉయ్యాల
అరిటాకు పరచి మనం పేర్చుదామమ్మా... ఉయ్యాల
ఎత్తైన బతుకమ్మను పేరుద్దామమ్మా... ఉయ్యాల ||
నెత్తిపైన గౌరమ్మను నిలుపుదామమ్మా... ఉయ్యాల
పసిడి ముద్దై గౌరి మెరిసిపోయేనయా... ఉయ్యాల
పట్టుకోకలు గట్టి పడతులు చేరగా... ఉయ్యాల
ముత్యాల గాజులు మురిసి మోగెనయా... ఉయ్యాల ||
ఊరంత ఒక్కటై వాడలకొచ్చెనా... ఉయ్యాల
రచ్చబండ కాడ రమణీయం ఆయెనా... ఉయ్యాల
వలయాకారముగా మనమంతా తిరుగుదాం... ఉయ్యాల
చప్పట్లు కొడుతూ చందమామ అందాం... ఉయ్యాల ||
అత్తమామల దీవెనలు పొందుదామమ్మా... ఉయ్యాల
ఆడపడుచులకు అండగా ఉందాము... ఉయ్యాల
సత్తుపిండి ప్రసాదం చవిచూద్దామమ్మా... ఉయ్యాల
మలీద ముద్దలు మక్కువగా తిందాము... ఉయ్యాల ||
ఒక్కరికొక్కరం వాయనాలు ఇద్దాం... ఉయ్యాల
చెరువు గట్టుపైన చిరునవ్వులు పూయగా... ఉయ్యాల
గంగమ్మ ఒడికి బతుకమ్మను పంపుదామమ్మా... ఉయ్యాల ||
పోయోచ్చి రావమ్మ మల్లొచ్చే ఏటికి... ఉయ్యాల
మా ఇండ్ల సిరులిచ్చి మమ్మల్ని దీవించు... ఉయ్యాల
పల్లె పల్లెన నీ పాట నిలవాలి... ఉయ్యాల
తెలంగాణ నేలకు దిష్టి తీయవమ్మా... ఉయ్యాల ||
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


