వాలెంటైన్స్ వీక్ 2026 క్యాలెండర్: ఈ 'ప్రేమ వారోత్సవాల' పూర్తి జాబితా మీకోసం
2026 సంవత్సరానికి సంబంధించి వాలెంటైన్స్ వీక్ ముంగిట మనం ఉన్నాం. మీరు ఎవరికైనా మీ మనసులో మాట చెప్పాలనుకున్నా, లేదా మీ భాగస్వామికి అద్భుతమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నా.. అందుకు తగ్గట్టుగా సిద్ధమవ్వడానికి ఇదే సరైన సమయం.
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఏ రోజున ఏం జరుపుకుంటారో, ఈ ఏడాది ఏ రోజు ఏ వారం వచ్చిందో ఈ పూర్తి క్యాలెండర్ ద్వారా తెలుసుకోండి.

వాలెంటైన్స్ వీక్ 2026: పూర్తి వివరాలు
ఈ ఏడాది వాలెంటైన్స్ వీక్ శనివారంతో ప్రారంభం కావడం విశేషం. వారాంతం (వీకెండ్) కావడంతో డేటింగ్స్, సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లకు ఇది చక్కని అవకాశం. రోజ్ డేతో మొదలై.. ప్రపోజ్ డే, చాక్లెట్ డే ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో సాగుతూ, చివరకు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.
ఒక చిన్న చిట్కా ఏమిటంటే.. ఈసారి వాలెంటైన్స్ వీక్ మొత్తం వీకెండ్‌తో ముడిపడి ఉండటం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు చాలా రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు డిన్నర్ లేదా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ముందుగానే బుకింగ్స్ చేసుకోవడం మంచిది.
1. రోజ్ డే (Rose Day)
ఫిబ్రవరి 7, శనివారం 2026లో రోజ్ డే శనివారం వచ్చింది. అంటే సెలవు మూడ్ ఉంటుంది కాబట్టి కేవలం గులాబీ ఇచ్చి సరిపెట్టకుండా, డే మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. ఎరుపు గులాబీ గాఢమైన ప్రేమకు, పసుపు స్నేహానికి, గులాబీ రంగు కృతజ్ఞతకు నిదర్శనం. శనివారం కాబట్టి పార్కులో పిక్నిక్ లేదా రోజ్ థీమ్‌తో ఉండే రెస్టారెంట్లకు వెళ్లవచ్చు.
2. ప్రపోజ్ డే (Propose Day)
ఫిబ్రవరి 8, ఆదివారం మీ మనసులో ఉన్న వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదే సరైన రోజు. ఇది ఆదివారం రావడంతో మరింత కలిసొచ్చే అంశం. ఏ ఆఫీస్ హడావుడి లేకుండా తీరికగా ఒక అందమైన ప్రదేశంలో మీ ఇష్టాన్ని చెప్పవచ్చు. సూర్యాస్తమయం వేళ ప్రపోజ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తిండిపోతుంది.
3. చాక్లెట్ డే (Chocolate Day)
ఫిబ్రవరి 9, సోమవారం వారంలో మొదటి రోజైన సోమవారాన్ని తీపిగా మార్చుకోవడానికి చాక్లెట్ డే ఉపయోగపడుతుంది. ఆఫీస్ పనిలో ఉన్న మీ పార్ట్నర్‌కు ఇష్టమైన చాక్లెట్లు పంపి వారి ముఖంలో చిరునవ్వు పూయించండి.
4. టెడ్డీ డే (Teddy Day)
ఫిబ్రవరి 10, మంగళవారం క్యూట్‌గా ఉండే టెడ్డీ బేర్లను బహుమతిగా ఇచ్చే రోజు ఇది. మీరు దగ్గర లేకపోయినా మీ ప్రేమకు గుర్తుగా ఈ బొమ్మలు మీ భాగస్వామికి తోడుగా ఉంటాయి. దూరం ఉండే ప్రేమికులు క్యూట్ గిఫ్స్ (GIFs) పంపి తమ ప్రేమను చాటుకోవచ్చు.
5. ప్రామిస్ డే (Promise Day)
ఫిబ్రవరి 11, బుధవారం ఈ రోజు కేవలం బహుమతులకు సంబంధించింది కాదు, భావోద్వేగాలకు సంబంధించింది. నమ్మకం, విధేయత, భవిష్యత్తుపై ఇచ్చే హామీలే ప్రామిస్ డే ప్రత్యేకత. "ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నీ మాట వింటాను" అని ఇచ్చే చిన్న హామీ కూడా బంధాన్ని బలపరుస్తుంది.
6. హగ్ డే (Hug Day)
ఫిబ్రవరి 12, గురువారం ప్రేమతో ఇచ్చే ఒక కౌగిలింత వెయ్యి మాటల కంటే గొప్పది. పని ఒత్తిడిలో ఉన్న మీ భాగస్వామికి ఒక ఆత్మీయ స్పర్శ ఎంతో ఊరటనిస్తుంది. దూరం ఉండేవారు కాఫీ లేదా టీ పంపించి మీ ప్రేమను 'వార్మ్ హగ్' రూపంలో తెలియజేయవచ్చు.
7. కిస్ డే (Kiss Day)
ఫిబ్రవరి 13, శుక్రవారం వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు వచ్చే ఈ రోజు ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇది శుక్రవారం కావడంతో, మరుసటి రోజు వచ్చే గ్రాండ్ సెలబ్రేషన్ (వాలెంటైన్స్ డే) కోసం సిద్ధమవ్వడానికి ఈ సాయంత్రం చక్కని వేదిక.
8. వాలెంటైన్స్ డే (Valentine's Day)
ఫిబ్రవరి 14, శనివారం ఇక అసలైన పండుగ రానే వచ్చింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే శనివారం రావడం ప్రేమికులకు పండుగ లాంటిదే. సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థం జరుపుకునే ఈ రోజున కేవలం డిన్నర్లే కాకుండా, లాంగ్ డ్రైవ్ లేదా మ్యూజియం విజిట్ వంటివి ప్లాన్ చేయండి. జీవిత భాగస్వామి పట్ల కృతజ్ఞతను చూపేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


