"కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు.. కష్టపడే తత్వం ఉంటే చాలు" అని నిరూపించారు ఓ 52 ఏళ్ల మహిళ. తన జీవితంలోనే మొదటి సంపాదనను ఈ వయసులో యూట్యూబ్ ద్వారా అందుకోవడంతో ఆమె కళ్లలో మెరిసిన ఆనందం, ఆ ఆనందంలో దాగి ఉన్న చిన్నపాటి కన్నీళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
అమ్మ సాధించిన విజయం.. గర్వపడుతున్న కూతురు

అన్షుల్ పారీక్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. వీడియోలో అన్షుల్ తన తల్లిని "ఏమైంది మమ్మీ?" అని అడగ్గా.. ఆ తల్లి ఎంతో గర్వంగా, భావోద్వేగంతో సమాధానమిచ్చారు. "నా 52 ఏళ్ల జీవితంలో మొదటిసారి సొంతంగా సంపాదించాను. అదీ యూట్యూబ్ ద్వారా.. కేవలం ఆరు నెలల్లోనే ఇది సాధ్యమైంది" అని ఆమె చెబుతుంటే, ఆ మాటల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉట్టిపడింది. "నేను చాలా గర్వపడుతున్న కూతురిని" అంటూ అన్షుల్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
యూట్యూబ్ సైతం ఫిదా
ఈ స్ఫూర్తిదాయక వీడియో ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. సామాన్యులే కాకుండా సాక్షాత్తు యూట్యూబ్ సంస్థ కూడా ఈ వీడియోపై స్పందించడం విశేషం. "ఇది నిజంగా అద్భుతమైన స్ఫూర్తినిస్తోంది. మీకు అభినందనలు. మీ ప్రయాణంలో మేము భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని యూట్యూబ్ అధికారికంగా కామెంట్ చేసింది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "వీడియో చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి.. గో అహెడ్ ఆంటీ" అని ఒకరు కామెంట్ చేయగా..
"ప్రతి క్రియేటర్ పడే కష్టం, ఆనందం ఆమె కళ్లలో కనిపిస్తున్నాయి" అంటూ మరికొందరు తమ భావాలను పంచుకున్నారు.
'లైఫ్ అన్‌స్క్రిప్టెడ్' (Life Unscripted): ఆమె సృజనాత్మక ప్రపంచం
ఈ 52 ఏళ్ల మహిళ 'లైఫ్ అన్‌స్క్రిప్టెడ్' అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నారు. ఇది పక్కా ఇండియన్ ఫ్యామిలీ కంటెంట్‌తో సాగే ఛానెల్. ఇందులో గ్రామీణ వాతావరణం, సాంప్రదాయ ఇళ్లు, చిన్నపాటి హాస్యం, నీతి కథలను కార్టూన్ పాత్రల ద్వారా వివరిస్తారు.
{{/usCountry}}ఈ 52 ఏళ్ల మహిళ 'లైఫ్ అన్‌స్క్రిప్టెడ్' అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నారు. ఇది పక్కా ఇండియన్ ఫ్యామిలీ కంటెంట్‌తో సాగే ఛానెల్. ఇందులో గ్రామీణ వాతావరణం, సాంప్రదాయ ఇళ్లు, చిన్నపాటి హాస్యం, నీతి కథలను కార్టూన్ పాత్రల ద్వారా వివరిస్తారు.
{{/usCountry}}ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 41,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 360 వీడియోలను అప్‌లోడ్ చేశారు. ఇందులో ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్(Shorts) ద్వారానే ఆమె పాపులర్ అయ్యారు.
కృష్ణ లీలలు, అత్తాకోడళ్ల కథలు, నానమ్మ పోడ్‌కాస్ట్‌లు వంటి ఆసక్తికరమైన అంశాలతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. వాస్తవ నేపథ్యాలపై యానిమేటెడ్ పాత్రలను ఉంచి ఆమె చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
సాధించాలనే తపన ఉంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, కష్టపడితే విజయం వరించి తీరుతుందని ఈ 'యూట్యూబ్ మామ్మ' నిరూపించారు.