...
...
Next Story

మాంసాహారం మానేసినా యూరిక్ యాసిడ్ తగ్గట్లేదా? అసలు సమస్య ఇదే

యూరిక్ యాసిడ్ పెరగడానికి మాంసం, పప్పు ధాన్యాలే కారణమని చాలామంది భావిస్తారు. కానీ, అసలు విలన్ ఫ్రక్టోజ్, చక్కెర అని ప్రముఖ వైద్యులు డాక్టర్ గగన్‌దీప్ సింగ్ వెల్లడించారు. పనీర్, మటన్ మానేసినా ఫలితం లేకపోవడానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Feb 05, 2026 11:23 AM IST
Advertisement

యూరిక్ యాసిడ్ పెరిగిందని రిపోర్టులో తేలగానే.. చాలామంది మొట్టమొదట చేసే పని మటన్, సీఫుడ్, పప్పులు, పనీర్ వంటి ప్రోటీన్ ఆహారాలను పూర్తిగా పక్కన పెట్టేయడం. అయినప్పటికీ చాలామందిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గవు. మరి పొరపాటు ఎక్కడ జరుగుతోంది? దీనికి సమాధానం మాంసాహారంలో లేదు, మనం రోజూ తీసుకునే తీపి పదార్థాల్లో ఉందని చెబుతున్నారు ప్రముఖ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ సింగ్.

మాంసాహారం మానేసినా యూరిక్ యాసిడ్ తగ్గట్లేదా? అసలు సమస్య ఇదే (Unsplash)
మాంసాహారం మానేసినా యూరిక్ యాసిడ్ తగ్గట్లేదా? అసలు సమస్య ఇదే (Unsplash)

శరీరంలో ప్యూరిన్ (Purines) అనే రసాయన సమ్మేళనాలు విచ్ఛిన్నమైనప్పుడు ఒక వ్యర్థ పదార్థంగా యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువైతే ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో 'హైపర్‌యూరిసెమియా' (Hyperuricemia) అంటారు.

మాంసం మానేసినా ఎందుకు తగ్గదు?

మనం తినే ఆహారం ద్వారానే యూరిక్ యాసిడ్ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. మన శరీరంలోని యూరిక్ యాసిడ్‌లో 70 శాతాన్ని మన కాలేయం (Liver) స్వయంగా తయారు చేస్తుంది. ఇది మనం తినే మాంసం వల్ల కాదు, మనం తీసుకునే ఫ్రక్టోజ్ (Fructose) మరియు చక్కెరల వల్ల ప్రేరేపితమవుతుందని డాక్టర్ గగన్‌దీప్ చెప్పారు.

"మనం మానేయాల్సింది మటన్, పప్పులు కాదు.. అసలు దోషులు సమోసాలు, స్వీట్లు. కాలేయం ఫ్రక్టోజ్‌ను ప్రాసెస్ చేసే క్రమంలో యూరిక్ యాసిడ్ ఒక బై-ప్రొడక్ట్‌గా (ఉప ఉత్పత్తి) విడుదలవుతుంది. ఒక ప్లేట్ మటన్ కంటే ఒక గ్లాసు పండ్ల రసం (Fruit Juice) లేదా తేనె మీ శరీరంలో యూరిక్ యాసిడ్‌ను వేగంగా పెంచుతాయి" అని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు.

అంటే, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పానీయాలు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ప్రోటీన్‌ను దూరం చేయడం కంటే, చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ఆయన సూచించారు.

యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవడానికి మార్గాలు ఇవే:

(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. సామాజిక మాధ్యమాల్లోని సమాచారం ఆధారంగా ఇది రూపొందించబడింది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా నిపుణులైన వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.)

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON