...
...
Next Story

సింగిల్ బెడ్‌రూమ్ నుంచి చారిత్రక రాజభవనానికి మారిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్

న్యూయార్క్ నగర తొలి సౌత్ ఏషియన్, ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మమ్దానీ, తన భార్య రమా దువాజీతో కలిసి అధికారిక నివాసం 'గ్రేసీ మాన్షన్'లోకి మారారు. సామాన్యుడిలా చిన్న అపార్ట్‌మెంట్‌ నుంచి ఈ చారిత్రక భవనానికి వారు చేరుకోవడం విశేషం.

Published on: Jan 13, 2026, 13:31:37 IST
Advertisement

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తన జీవితంలో మరో కీలక ఘట్టానికి చేరుకున్నారు. ఇప్పటివరకు క్విన్స్‌లోని అస్టోరియాలో ఉన్న ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌లో సాధారణ జీవితం గడిపిన ఆయన, ఇప్పుడు మేయర్ల అధికారిక నివాసమైన చారిత్రక 'గ్రేసీ మాన్షన్' (Gracie Mansion) లోకి తన భార్య, ప్రముఖ ఇలస్ట్రేటర్ రమా దువాజీతో కలిసి గృహప్రవేశం చేశారు. జనవరి 12న వారు తమ సామాన్లతో ఈ కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

"ఇది ప్రజల ఇల్లు"

సింగిల్ బెడ్‌రూమ్ నుంచి చారిత్రక రాజభవనానికి మారిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్
సింగిల్ బెడ్‌రూమ్ నుంచి చారిత్రక రాజభవనానికి మారిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్

"చాలామంది న్యూయార్క్ వాసులలాగే మేము కూడా నగరంలోని మరో ప్రాంతానికి మారుతూ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. గ్రేసీ మాన్షన్ నిజానికి ప్రజల ఇల్లు. అలాంటి చోట నివాసం ఉండే అవకాశం దక్కడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం" అని మమ్దానీ సోషల్ మీడియాలో భావోద్వేగంగా రాసుకొచ్చారు. అప్పర్ ఈస్ట్ సైడ్ ప్రజలు తమకు ఘనస్వాగతం పలికారని ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

చిన్న అపార్ట్‌మెంట్ నుంచి 11,000 చదరపు అడుగుల భవనానికి..

మమ్దానీ దంపతులు ఇప్పటివరకు ఉన్న అపార్ట్‌మెంట్ కేవలం ఒక బెడ్రూమ్‌తో, కనీసం వాషింగ్ మెషీన్ కూడా లేని సాధారణ నివాసం. అక్కడ తరచూ పైపులు లీక్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారమని గతంలో వారు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వారు మారిన గ్రేసీ మాన్షన్ ఏకంగా 11,000 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంది.

ఈ చారిత్రక భవనంలో:

  • పై అంతస్తులో ఐదు విశాలమైన బెడ్రూంలు ఉన్నాయి.
  • కింద అంతస్తులో భారీ బాల్‌రూమ్, డైనింగ్ హాల్ ఉన్నాయి.
  • ఈస్ట్ రివర్‌ను చూస్తూ సేదతీరడానికి అందమైన వెరాండా, పచ్చని తోటలు ఉన్నాయి.
  • ప్రత్యేకంగా భోజనం వండి పెట్టేందుకు ఒక పర్సనల్ షెఫ్ కూడా ఉంటారు.

సొంత ఆలోచనలతో కొత్త హంగులు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON