Tata Tiago 2026 : టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​ ఎందుకు కొనాలి? 5 కారణాలు..

Tata Tiago price : టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'టియాగో'ను సరికొత్త ఫీచర్లు, ఆధునిక డిజైన్‌తో 2026 వెర్షన్‌లో ఇటీవలే విడుదల చేసింది. కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అవుతోంది. మరి ఈ మోడల్​ని హ్యాచ్​బ్యాక్​ని కొనాలి? 5 ముఖ్యమైన కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 8, 2026, 05:31:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో టాటా మోటార్స్ రూపురేఖలను మార్చిన కార్లలో 'టాటా టియాగో' అత్యంత కీలకమైనది. గతంలో ఉన్న టాటా బోల్ట్ స్థానంలో 2016లో సరికొత్త ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా ఇది అడుగుపెట్టింది. అప్పట్లో టాటా సంస్థ రీబ్రాండింగ్‌లో భాగంగా ప్రవేశపెట్టిన సరికొత్త ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో టియాగో మొదటి వరుసలో నిలిచింది. ఇక మార్కెట్​లోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా, చిన్నపాటి మార్పులతో సరిపెట్టకుండా ఈసారి టాటా మోటార్స్ ఇందులో భారీ మార్పులు చేస్తూ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇటీవలే లాంచ్​ చేసింది. సరికొత్త లుక్, మునుపెన్నడూ లేని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో 2026 టాటా టియాగోను సిద్ధం చేసింది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, సిట్రోయెన్ సీ3ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇది రెడీ అయిపోయింది.

2026 టాటా టియాగో..
2026 టాటా టియాగో..

ఈ నేపథ్యంలో మిగిలిన ఎంట్రీ లెవల్ కార్లతో పోలిస్తే కొత్త టాటా టియాగో ఏ విషయాల్లో అత్యుత్తమంగా నిలిచిందో ఆ 5 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు చూద్దాం.

1. అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ధర..

2026 టాటా టియాగో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ కేవలం రూ.4.69 లక్షలుగా నిర్ణయించింది. మార్కెట్​లోని దీని బేస్ వేరియంట్లతో పోలిస్తే ఇది కనీసం రూ.29,000 తక్కువ. టియాగో బేస్ వేరియంట్‌లో ఫీచర్లు కొంత ప్రాథమికంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఏ ఇతర పోటీ కారుతో పోల్చినా ఇది అత్యంత సరసమైన ధరకే లభిస్తుండటం విశేషం.

2. మోడ్రన్ అండ్ స్టైలిష్ ఎక్స్‌టీరియర్..

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్ వెలుపలి డిజైన్‌లో కంపెనీ కీలక మార్పులు చేసింది. కారుకు మరింత అగ్రెసివ్, మోడ్రన్ లుక్ ఇచ్చేందుకు వీలుగా స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, రెక్టాంగ్యులర్ ఫాగ్ ల్యాంప్స్‌ను అమర్చారు. ముందు భాగంలో సరికొత్త బంపర్‌తో పాటు బ్లాక్-అవుట్ లోయర్ గ్రిల్‌కు జియోమెట్రికల్ డిజైన్ ఇచ్చారు. కారు పక్క భాగంలో వీల్ ఆర్చెస్‌పై బ్లాక్ క్లాడింగ్, సరికొత్త అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక వైపు చూస్తే, స్లిమ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్స్ భ్రమను కలిగించే ఫాక్స్ కనెక్టెడ్ లైటింగ్, రేర్-వ్యూ కెమెరా పొజిషన్ మార్చడం, కొత్త రియర్ బంపర్ వంటి మార్పులు కారుకు సరికొత్త ఎడ్జీ లుక్‌ను తీసుకువచ్చాయి.

3. తిరుగులేని భద్రత..

టాటా కార్లు అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది సేఫ్టీ. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు అయినప్పటికీ ఈ టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​లో భద్రత విషయంలో టాటా ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులోని అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. అంటే మీరు బేస్ వేరియంట్ కొన్నా, టాప్ వేరియంట్ కొన్నా 6 ఎయిర్‌బ్యాగ్‌ల రక్షణ లభిస్తుంది. దీనితో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా 360-డిగ్రీల కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఎన్నో అధునాతన భద్రతా ప్రమాణాలను ఇందులో చేర్చారు.

4. మురిపించే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..

2026 టాటా టియాగోలో ఫీచర్ల జాబితా చాలా పెద్దదిగా ఉంది. బడ్జెట్ కార్లలో ఇలాంటి ఫీచర్లు ఊహించడం కష్టమనేలా టాటా దీనిని రూపొందించింది. కారు లోపల 10.25 ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 ఇంచుల ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మాన్యువల్ హెచ్‌వీఏసీ కంట్రోల్స్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడల్ షిఫ్టర్స్ (ఏఎమ్‌టీ వేరియంట్లలో మాత్రమే), కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రెండు 65డబ్ల్యూ యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. వీటితో పాటు 35 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉండటం విశేషం.

5. ఆకట్టుకునే సరికొత్త కలర్ ఆప్షన్లు..

యువ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకునేందుకు టాటా మోటార్స్ ఈసారి మూడు సరికొత్త వైబ్రెంట్ కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. అందులో వారణాసి వైబ్రెన్స్, పాంగోంగ్ బ్లూ, సోబో సెర్జ్ అనే ఆకర్షణీయమైన రంగులు ఉన్నాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా ఉండే ప్రిస్టైన్ వైట్, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే రంగుల్లోనూ ఈ కారు లభిస్తుంది.

ఎంట్రీ లెవల్ కార్లలో ప్రీమియం ఫీచర్లు, అత్యుత్తమ భద్రతను కోరుకునే వారికి సరికొత్త టాటా టియాగో 2026 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పక తప్పదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More