Cheaper flight tickets : తక్కువ ధరకు విమాన టికెట్లు కావాలా? ఈ క్రెడిట్​ కార్డులు మీకోసమే..!

మీరు ట్రావెలింగ్​ చేస్తుంటారా? అయితే తక్కువ ధరకు విమాన టికెట్లు పొందే విధంగా మీ కోసం కొన్ని క్రెడిట్​ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 13, 2025, 09:46:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారా? మీ దగ్గర క్రెడిట్​ కార్డులు ఉన్నాయా? లేక కొత్తది తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! క్రెడిట్​ కార్డు రివార్డ్ పాయింట్లను ఉపయోగించి విమాన టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లను లేదా ఉచిత ప్రయాణాలను పొందవచ్చని మీకు తెలుసా? అన్ని క్రెడిట్ కార్డులు ఈ ప్రయోజనాలు ఇవ్వవు కానీ ప్రత్యేకంగా ట్రావెల్ బెనిఫిట్స్ అందించే కార్డులు కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడే కొన్ని ఉత్తమమైన క్రెడిట్ కార్డుల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

తక్కువ ధరకే విమాన టికెట్లు..!
తక్కువ ధరకే విమాన టికెట్లు..!

ప్రయాణ ప్రయోజనాల కోసం ఉత్తమ క్రెడిట్ కార్డులు..

1. యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్:

కార్డుతో మీరు ఏ విమానయాన సంస్థను ఎంచుకున్నా, ప్రతి ప్రయాణంపై రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

ప్రయాణ ఖర్చులపై ప్రతి రూ. 100 ఖర్చుకు 5 EDGE మైల్స్ వస్తాయి. ఇక్కడ 1 EDGE మైల్ ఒక రూపాయికి సమానం!

కార్డు తీసుకున్న 37 రోజుల్లోపు మొదటి లావాదేవీ చేస్తే, అదనంగా 2,500 EDGE మైల్స్ వెల్కమ్​ గిఫ్ట్​గా లభిస్తాయి.

2. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్:

ఈ కార్డులో నిర్దిష్ట ఖర్చు పరిమితిని చేరుకున్న తర్వాత రివార్డ్ పాయింట్లు వస్తాయి.

ఉదాహరణకు: ఒక సంవత్సరంలో మీరు రూ. 1.90 లక్షలు ఖర్చు చేస్తే, మీకు 15,000 మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్లు వస్తాయి. వీటిని 'ప్లాటినం ట్రావెల్ కలెక్షన్'లో రిడీమ్ చేసుకోవచ్చు.

ఒక సంవత్సరంలో రూ. 4 లక్షలు ఖర్చు పరిమితిని దాటితే, అదనంగా మరో 25,000 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి!

3. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్:

ఎస్బీఐ కార్డ్ అందించే ఈ క్రెడిట్​ కార్డులో వెల్కమ్​ గిఫ్ట్​గా 5,000 ట్రావెల్ క్రెడిట్స్ ఇస్తారు. ప్రయాణానికి సంబంధించిన ప్రతి రూ. 200 ఖర్చుకు 6 ట్రావెల్ క్రెడిట్‌లు లభిస్తాయి.

ఈ ట్రావెల్ క్రెడిట్లను ఎయిర్ మైల్స్/హోటల్ పాయింట్లుగా లేదా నేరుగా ప్రయాణ బుకింగ్‌ల కోసం మార్చుకోవచ్చు.

4. హెచ్‌డీఎఫ్‌సీ 6ఈ రివార్డ్స్ ఇండిగో క్రెడిట్ కార్డ్:

ఇండిగో యాప్ లేదా వెబ్‌సైట్‌లో విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే, ప్రతి రూ. 100 ఖర్చుపై 2.5 6E రివార్డ్‌లు వస్తాయి.

ఈ కార్డుతో రూ. 1,500 విలువైన ఒక కాంప్లిమెంటరీ విమాన టికెట్ వోచర్ లభిస్తుంది.

ప్రతి నెలాఖరులో రివార్డులు ఆటోమేటిక్‌గా ఇండిగో ఖాతాకు బదిలీ అవుతాయి.

5. యాక్సిస్ బ్యాంక్ హారిజన్ క్రెడిట్ కార్డ్:

యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ EDGE పోర్టల్, నేరుగా విమానయాన సంస్థల వెబ్‌సైట్లలో చేసే ప్రతి రూ. 100 ఖర్చుపై 5 EDGE మైల్స్ లభిస్తాయి.

కార్డు జారీ అయిన 30 రోజుల్లోపు రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొదటి లావాదేవీపై 5,000 EDGE మైల్స్ క్రెడిట్ అవుతాయి.

6. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమిరేట్స్ స్కైవార్డ్స్ క్రెడిట్ కార్డ్:

ఈ క్రెడిట్ కార్డుపై చేసే ఖర్చుల ద్వారా స్కైవార్డ్స్ మైల్స్ లభిస్తాయి. వీటిని విమాన టిక్కెట్లపై రిడీమ్ చేసుకోవచ్చు.

అదనంగా, ఈ కార్డుదారులు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

ఈ స్కైవార్డ్స్ క్రెడిట్ కార్డులో ఎమరాల్డే, సప్పిరో, రూబిక్స్ వంటి వివిధ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ కార్డ్​ వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More