8వ పే కమిషన్ ఎప్పుడు వస్తుంది? జీతం ఎంత పెరుగుతుంది? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను స్కామర్లు వాడుకుంటున్నారు. వాట్సాప్‌లో 'మీ కొత్త జీతం ఎంతో ఈ యాప్‌లో లెక్కించుకోండి' అంటూ కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఇవి అసలైన కాలిక్యులేటర్లు కావు, మీ ఫోన్‌ను హ్యాక్ చేసే సైబర్ నేరగాళ్ల ఉచ్చులు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?

{{^htLoading}} {{/htLoading}}
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) ఈ మోసం జరిగే తీరును ఇలా వివరించింది.
- మెసేజ్ రావడం: ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో 8వ పే కమిషన్ తర్వాత మీ శాలరీ లేదా పెన్షన్ వివరాలు తెలుసుకోవచ్చని ఉంటుంది.
- APK ఫైల్: ఆ వివరాల కోసం ఒక APK ఫైల్ (ఒక రకమైన యాప్ ఇన్‌స్టలేషన్ ఫైల్) డౌన్‌లోడ్ చేయమని కోరుతారు.
- యాక్సెస్ పొందడం: మీరు ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయగానే, మీ ఫోన్ కంట్రోల్ మొత్తం స్కామర్ల చేతికి వెళ్తుంది.
- డబ్బు మాయం: మీ ఫోన్ ద్వారా మీ బ్యాంకింగ్ వివరాలు, OTPలు దొంగిలించి క్షణాల్లో మీ ఖాతా నుండి డబ్బు విత్ డ్రా చేస్తారు.
మోసపోకుండా ఉండాలంటే.. ఏం చేయాలి? (Dos)
- అధికారిక వెబ్‌సైట్: 8వ పే కమిషన్ లేదా జీతాల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కేవలం అధికారిక వెబ్‌సైట్: https://8cpc.gov.in/ ను మాత్రమే సందర్శించండి.
- వెరిఫైడ్ సోర్స్: ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్ ద్వారా APK ఫైళ్లను పంపదని గుర్తుంచుకోండి. వార్తలను కేవలం నమ్మదగ్గ టీవీ ఛానళ్లు లేదా వెబ్‌సైట్ల నుండే తెలుసుకోండి.
- లింకులను తనిఖీ చేయండి: ఏదైనా లింక్ వచ్చినప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? డొమైన్ పేరు వింతగా ఉందా? అని గమనించండి.
- బ్యాంకును సంప్రదించండి: ఒకవేళ అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంక్ ప్రతినిధికి ఫోన్ చేసి నిర్ధారించుకోండి.
ఏం చేయకూడదు? (Don'ts)
- APK ఫైల్స్ డౌన్‌లోడ్ వద్దు: అపరిచిత వ్యక్తులు పంపే యాప్స్ లేదా ఫైళ్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి.
- రహస్య వివరాలు పంచుకోవద్దు: మీ OTP, UPI పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, CVV, లేదా వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ ఎవరికీ చెప్పకండి. ప్రభుత్వం ఇవి ఎప్పటికీ అడగదు.
- అత్యవసరం అని భయపడకండి: స్కామర్లు ఎప్పుడూ "వెంటనే చేయండి, లేదంటే మీ సర్వీస్ ఆగిపోతుంది" అంటూ భయపెడతారు. అలాంటి మెసేజ్‌లను పట్టించుకోకండి.
1930కు కాల్ చేయండి
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
{{/usCountry}} {{#usCountry}}
సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
{{/usCountry}}