Abhishek Sharma: 30 బాల్స్ లోనే సెంచరీ.. అభిషేక్ వర్మ రికార్డు హండ్రెడ్ సీక్రెట్ ఇదే.. యువరాజ్ సింగ్ నుంచి మెసేజ్!

Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ షేక్ ఆడించాడు. అఫ్గానిస్థాన్ తో మూడో టీ20లో 30 బాల్స్ లోనే హండ్రెడ్ తో ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు తన మెంటార్ యువరాజ్ సింగ్ మెసేజ్ పంపించాడని అభిషేక్ వెల్లడించాడు. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Sep 18, 2026, 11:44:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Abhishek Sharma: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) హిస్టారిక్ రికార్డు సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల విభాగంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తనకు చేసిన మెసేజ్ గురించి అభిషేక్ వెల్లడించాడు.

సింగిల్స్ తీయ‌డం నేర్చుకో.. అభిషేక్ శ‌ర్మ‌కు యువ‌రాజ్ మెసేజ్.. ఆ వెంట‌నే 30 బాల్స్ సెంచ‌రీ రికార్డు (Rahul Singh)
సింగిల్స్ తీయ‌డం నేర్చుకో.. అభిషేక్ శ‌ర్మ‌కు యువ‌రాజ్ మెసేజ్.. ఆ వెంట‌నే 30 బాల్స్ సెంచ‌రీ రికార్డు (Rahul Singh)

అభిషేక్ శర్మ రికార్డు

టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ నిజంగానే షేక్ ఆడించాడు. గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి పరుగుల సునామీని చూపించాడు. 30 బాల్స్ లోనే సెంచరీ బాదేశాడు. అలాగే ఇండియా తరపున గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న వేగవంతమైన టి20 సెంచరీ రికార్డును బద్ధలు కొట్టాడు.

సింగిల్స్ తీయడం నేర్చుకో

అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం అభిషేక్ శర్మ తన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టాడు. మూడో టి20 మ్యాచ్‌కంటే ముందే తన మెంటార్, మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ నుంచి ఒక ప్రత్యేకమైన టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని తెలిపాడు.

ప్రతి బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించవద్దని, బంతి హిట్ చేసే స్లాట్ లో లేనప్పుడు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని యువరాజ్ సూచించాడని అభిషేక్ చెప్పాడు. మైదానంలో ఎక్కువ సేపు క్రీజులో ఉంటే రన్స్ అవే వస్తాయని యువరాజ్ ఇచ్చిన ఈ చిన్న సలహాయే తనను పెద్ద ఇన్నింగ్స్ ఆడేలా చేసిందని అభిషేక్ స్పష్టం చేశాడు.

30 బంతుల్లోనే సెంచరీ

న్యూఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మైదానంలో పరుగుల తుఫాను సృష్టించాడు. ఆరంభం నుంచే అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడిన అతను కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 108 పరుగుల విస్ఫోటక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 221/7 భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ జట్టును చెరో 3 వికెట్లతో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ దెబ్బకొట్టారు. అఫ్గాన్ 94 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 127 పరుగుల భారీ తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

సిరీస్ లో అదుర్స్

జింబాబ్వే పర్యటనలో తీవ్ర ఒత్తిడి, ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మకు ఈ అఫ్గానిస్థాన్ సిరీస్ కెరీర్ చేంజింగ్ మూమెంట్‌గా మారింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా 82, 39, 108 పరుగులతో మొత్తం 229 పరుగులు సాధించి పవర్‌ప్లేలో జట్టుకు తిరుగులేని పునాది వేశాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి టీమిండియాకు ఊహించని శుభారంభాలను అందించాడు.

స్ట్రైక్ రొటేషన్

జింబాబ్వే పర్యటనలో ఎదురైన వైఫల్యాల తర్వాత అభిషేక్ శర్మ తిరిగి పుంజుకున్న తీరు అతని మెంటల్ టఫ్ నెస్ ను చాటుతోంది. గతంలో కేవలం మొదటి బంతి నుంచే ఆల్‌ఔట్ అటాక్ మోడ్‌లో వెళ్లి అభిషేక్ వికెట్ సమర్పించుకునేవాడు. ఇప్పుడు యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వంలో స్ట్రైక్ రొటేషన్, షాట్ సెలెక్షన్‌పై దృష్టి సారించడంతో అభిషేక్ బ్యాటింగ్ తీరు మారింది.

రోహిత్ శర్మ టి20ల నుంచి తప్పుకున్న తర్వాత భారత ఓపెనింగ్ స్లాట్‌లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు అభిషేక్ శర్మ పర్ఫెక్ట్ బ్యాటర్ గా మారుతున్నాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల్లో 30 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకోవడం, 40 కంటే తక్కువ బంతుల్లో రెండో టి20 సెంచరీ నమోదు చేయడం ప్రపంచ క్రికెట్‌లో అతని పవర్‌హిట్టింగ్ సత్తాను చాటుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More