Gemini prompts : ఈ ప్రాంప్ట్‌లతో.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్ రెడీ!
గూగుల్ జెమినీ ఏఐ ఫొటోలు క్రియేట్ చేసుకున్నారా? అయితే ఇక ప్రెజెంటేషన్స్ చేసుకోవడానికి కూడా రెడీ అవ్వండి! జెమినీలోని కొత్త ఫీచర్‌తో మీరు క్షణాల్లోనే ప్రెజెంటేషన్స్ చేసుకోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్కెట్‌లో గూగుల్ జెమినీ గత కొన్ని నెలలుగా పట్టు సాధిస్తోంది. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన 'నానో బనానా' మోడల్ వంటి వివిధ మోడళ్లను విడుదల చేసింది. ఈ మోడల్‌తో ప్రజలు తమకు నచ్చిన విధంగా ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక ఇప్పుడు గూగుల్ తమ ఏఐ అసిస్టెంట్‌కు మరో ఆసక్తికరమైన సామర్థ్యాన్ని జోడిస్తోంది!
ఇకపై, జెమినీ ఏఐ టూల్ ద్వారా వినియోగదారులు కేవలం కొన్ని సెకన్లలోనే ప్రెజెంటేషన్లు తయారు చేయగలుగుతారు. ఇందుకోసం ‘క్యాన్వాస్’ టూల్‌ను ఉపయోగిస్తుంది. 'క్యాన్వాస్' టూల్ కొంత కాలంగా జెమినీ యాప్‌లో భాగమైనప్పటికీ, ప్రెజెంటేషన్లను సృష్టించే ఈ కొత్త ఫీచర్ ఇప్పుడే వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.
జెమినీలో ప్రెజెంటేషన్లు ఎలా తయారు చేయవచ్చు?
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు ఒక రీసెర్చ్ పేపర్ లేదా మరేదైనా డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రెజెంటేషన్ తయారు చేయమని చాట్‌బాట్‌ను అడగవచ్చు.
అంతేకాకుండా, కేవలం సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి కూడా ప్రెజెంటేషన్లను తయారు చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుంది.
యూజర్లు ఈ చాట్‌బాట్ సహాయంతో నిర్మాణాత్మకమైన, థీమ్ ఆధారిత స్లైడ్ డెక్‌లను తయారు చేయవచ్చు. ఇవి వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం 'ప్రో' ఖాతాదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తోంది. రాబోయే వారాల్లో ఇది సాధారణ వినియోగదారులందరికీ లభిస్తుంది.
ఒకవేళ ఈ ఫీచర్ మీ గూగుల్ ఖాతాలో ఇప్పటికే ఉంటే, మీరు ప్రయత్నించడానికి వీలుగా కొన్ని రకాల ప్రెజెంటేషన్ వివరాలను ఇక్కడ చూసేయండి..
జెమినీని ఉపయోగించి ఎలాంటి ప్రెజెంటేషన్లు తయారు చేయవచ్చు?
పుస్తకాల సారాంశాలు : మొత్తం పుస్తకాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా అందులోని ముఖ్యమైన అంశాల గురించి ప్రెజెంటేషన్‌ను సృష్టించవచ్చు. లేదా మరొక ఎల్ఎల్ఎం (లార్జ్ లాంగ్యుయేజ్ మోడల్) ద్వారా ముఖ్యమైన అంశాలను సేకరించి, ఆ టెక్స్ట్‌ను జెమినీ 'క్యాన్వాస్' టూల్‌లో అప్‌లోడ్ చేసి కూడా ప్రెజెంటేషన్ తయారు చేయవచ్చు.
వీటికి సంబంధించిన కొన్ని ఏఐ ప్రాంప్ట్‌లను ఇక్కడ చూడండి :
“You have the uploaded book. Produce a 10-item outline of the book’s biggest ideas. For each idea, give: 1-sentence thesis, 2 bullets of supporting evidence with page refs, and 1 notable quote (\le 25 words) with page. Group related ideas and suggest the best presentation order”
Education presentation:
"Create an educational presentation on climate change impacts for high school students. Include causes, effects on different ecosystems, real-world examples, individual actions, and innovative solutions. Make it visually engaging with suggested infographics."
Product launch deck:
“Build a 12-slide launch deck for [product]. Sections: problem, solution, demo flow, personas, pricing, GTM, competitive matrix, roadmap (Q1–Q4), risks, FAQ. Include speaker notes and a one-slide exec summary.”
Onboarding guide:
“Draft a 9-slide onboarding deck for new users of [product]. Show ‘first 7 days’ milestones, key setup steps with visuals, and a slide of common pitfalls + fixes.”
Case study:
“Generate a 6-slide case study: client context, problem, solution architecture, before/after metrics, quote, and lessons learned. Add notes with data sources.”
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


