GATE 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది ఆ రోజే- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల తేదీ ఖరారైంది. జనవరి 2న అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? గేట్ 2026 పరీక్ష తేదీలు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026 అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్‌లో ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గేట్ 2026 అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అడ్మిట్ కార్డుల విడుదల తేదీపై తాజాగా స్పష్టత వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జనవరి 2, 2026 న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, అభ్యర్థులు వాటిని అధికారిక గేట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

గేట్ 2026- అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
అభ్యర్థులు తమ గేట్ 2026 (GATE 2026) అడ్మిట్ కార్డులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ని అనుసరించాలి:
స్టెప్ 1: ముందుగా, అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను సందర్శించండి.
స్టెప్ 2: మీ లాగిన్ వివరాలను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 3: అభ్యర్థి డాష్‌బోర్డ్‌లో ‘అడ్మిట్ కార్డు’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీ వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోండి. ఆ తర్వాత అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి, ప్రింటౌట్ తీసుకోండి.
గేట్ 2026- పరీక్ష నిర్వహణ, తేదీలు..
ఈ ఏడాది గేట్ 2026 పరీక్షను ఐఐటీ గౌహతి, ఐఐఎస్‌సీ బెంగళూరు సహా అన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జాతీయ సమన్వయ మండలి (ఎన్సీబీ), విద్యా మంత్రిత్వ శాఖ తరఫున ఈ పరీక్ష జరుగుతుంది.
పరీక్షా విధానం: పరీక్ష కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ పద్ధతిలో జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు: గేట్ 2026 ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15, 2026 తేదీల్లో జరగనున్నాయి.
గేట్ 2026- పరీక్ష పాటర్న్..
గేట్ 2026 పరీక్ష మొత్తం 30 టెస్ట్ పేపర్‌లకు జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ భాషలోనే ఉంటుంది.
మొత్తం మార్కులు: ప్రతి గేట్ 2026 పేపర్‌కు మొత్తం 100 మార్కులు ఉంటాయి.
జనరల్ ఆప్టిట్యూడ్ (జీఏ): అన్ని పేపర్‌లకు జనరల్ ఆప్టిట్యూడ్ కామన్‌గా ఉంటుంది. దీనికి 15 మార్కులు కేటాయించారు.
ప్రధాన సబ్జెక్టు: మిగిలిన 85 మార్కులు సంబంధిత టెస్ట్ పేపర్ సిలబస్‌ను కవర్ చేస్తాయి.
గేట్ 2026- పరీక్ష ప్రాముఖ్యత..
ఈ జాతీయ స్థాయి పరీక్ష ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, కామర్స్, ఆర్ట్స్ విభాగాల్లో అభ్యర్థుల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులపై అవగాహనను అంచనా వేస్తుంది. గేట్ 2026 స్కోరు,, ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


