GATE 2026 షెడ్యూల్​ విడుదల- తేదీలు, పేపర్లు, సెషన్లు, టైమింగ్స్​ వివరాలు..

గేట్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐఐటీ గౌహతి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో గేట్​ 2026 పరీక్ష తేదీలు, సెషన్లు, టైమింగ్​, పేపర్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 18, 2025, 06:45:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్​) 2026 పరీక్షల షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను సందర్శించాల్సి ఉంటుంది.

GATE 2026 షెడ్యూల్​ విడుదల
GATE 2026 షెడ్యూల్​ విడుదల

ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష చాలా కీలకం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొత్తం నాలుగు రోజుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 టెస్ట్ పేపర్‌లను ఉదయం- మధ్యాహ్నం సెషన్లుగా విభజించి, అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు వీలుగా ఈ షెడ్యూల్‌ను రూపొందించారు.

గేట్ 2026 ముఖ్యమైన తేదీలు, టైమింగ్​

గేట్​ 2026 ఫిబ్రవరి 7, 2026 నుంచి ఫిబ్రవరి 15, 2026 వరకు జరుగుతుంది. ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీల) పర్యవేక్షణలో నిర్వహిస్తారు.

  • ఉదయం సెషన్- ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు
  • మధ్యాహ్నం సెషన్- మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు

గేట్​ 2026 ఫలితాలు మార్చి 19, 2026 న విడుదలయ్యే అవకాశం ఉంది.

గేట్​ 2026 షెడ్యూల్..

గేట్​ 2026 తేదీల వారీగా ఏయే పేపర్లు ఏ సెషన్‌లో ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు:

1. శనివారం, ఫిబ్రవరి 7, 2026

ఉదయం సెషన్: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.

మధ్యాహ్నం సెషన్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, జియోమాటిక్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.

2. ఆదివారం, ఫిబ్రవరి 8, 2026

ఉదయం సెషన్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ 1, స్టాటిస్టిక్స్.

మధ్యాహ్నం సెషన్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ 2, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.

3. శనివారం, ఫిబ్రవరి 14, 2026

ఉదయం సెషన్: సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 1, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.

మధ్యాహ్నం సెషన్: బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్.

4. ఆదివారం, ఫిబ్రవరి 15, 2026

ఉదయం సెషన్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.

మధ్యాహ్నం సెషన్: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లతో పరీక్ష ముగుస్తుంది.

షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉంటే తెలుసుకోవడానికి అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2026 (గేట్​ 2026) అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More