Budget smartphone : రూ. 9,999కే 6300 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్- రియల్‌మీ పీ4 లైట్ హైలైట్స్ ఇవే..
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి బిగ్ అప్డేట్! రూ. 9999కే 6,300ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది రియల్‌మీ సంస్థ. దాని పేరు రియల్‌మీ పీ4 లైట్. ఇదొక 5జీ గ్యాడ్జెట్. ఈ మొబైల్ ఫీచర్స్, సేల్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ వచ్చేసింది. రియల్‌మీ తన బడ్జెట్ ఫ్రెండ్లీ పీ4 సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ.. భారత్‌లో ‘రియల్‌మీ పీ4 లైట్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రోజువారీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ వినియోగం, మీడియా కంటెంట్‌ను వీక్షించే సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ నెల చివరిలో విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ ధృవీకరించింది. కాగా, ఫ్లిప్‌కార్ట్, బ్రాండ్ ఆన్‌లైన్ స్టోర్లలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ రియల్‌మీ పీ4 లైట్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్‌మీ P4 లైట్ 5జీ- ధర, కలర్స్, సేల్ ఆఫర్లు..
రియల్‌మీ పీ4 లైట్ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 11,999గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా, కంపెనీ రూ. 1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 1,000 కూపన్‌ను అందిస్తోంది. ఈ డివైజ్ బీచ్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్, సీ బ్లూ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ విక్రయాలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి.
రియల్‌మీ పీ4 లైట్ 5జీ- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
రియల్‌మీ పీ4 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ స్క్రీన్ 90హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను, 180 హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే, ఇందులో 13ఎంపీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ సెకనుకు 30 ఫ్రేమ్‌ల వేగంతో 1080పీ రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ పీ4 లైట్ 5జీలో 12 ఎన్ఎం ప్రాసెస్‌పై రూపొందించిన ఆక్టా-కోర్ యూనీఎస్ఓసీ టీ7250 చిప్‌సెట్‌ను వాడారు. ఇది 4 జీబీ ర్యామ్, గరిష్టంగా 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది రియల్‌మీ యూఐతో కూడిన ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌పై రన్ అవుతుంది. అదనంగా, ఈ డివైజ్ ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే ఇది డస్ట్ అండ్ వాటర్ స్ల్పాసెష్ నుంచి రక్షణనిస్తుంది.
ఈ రియల్‌మీ పీ4 లైట్ హైలైట్ దాని బ్యాటరీ అనే చెప్పుకోవాలి! ఇందులో భారీ 6300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, వై-ఫై, BeiDou, GPS, GLONASS, Galileo వంటి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
మరి మీరు ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా?
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- రియల్‌మీ పీ4 లైట్5జీలో ఉన్న 6300 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేకత ఏంటి?
సమాధానం- ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో చాలా అరుదు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కానీ ఇందులో అంతకంటే పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు రెండు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది 15డబ్ల్యూ ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఇంత పెద్ద బ్యాటరీ పూర్తిస్థాయిలో ఛార్జ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు.
ప్రశ్న- ఈ ఫోన్‌కు ఉన్న ఐపీ54 రేటింగ్ వల్ల ప్రయోజనం ఏంటి?
సమాధానం- ఐపీ54 రేటింగ్ అంటే ఈ ఫోన్‌కు దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ ఉంటుంది. ఒకవేళ మీరు వర్షంలో వెళుతున్నప్పుడు కొన్ని నీటి చినుకులు ఫోన్‌పై పడినా లేదా ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నా ఫోన్ అంత త్వరగా పాడవదు. అయితే, దీనిని నీటిలో ముంచకూడదు. ఇది వాటర్-ప్రూఫ్ కాదు. కానీ ఈ బడ్జెట్ ధరలో ఇలాంటి రక్షణ ఫీచర్ ఉండటం వినియోగదారులకు అదనపు ప్రయోజనం అనే చెప్పాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


