Amazon Great Indian Festival Sale : ఐఫోన్ కొనాలా? ఇదే రైట్ టైమ్! అమెజాన్‌లో క్రేజీ డీల్స్..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 లో ఐఫోన్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 17ఈ స్మార్ట్‌ఫోన్లపై లభిస్తున్న మైండ్ బ్లాకింగ్ డిస్కౌంట్లు, ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఆఫర్లు, డిస్కౌంట్లలో ఐఫోన్‌ని కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకోసమే! ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026'యాపిల్ ప్రియుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై లభిస్తున్న ఆఫర్లతో పాటు ఐఫోన్ సిరీస్‌పై ఆకర్షణీయమైన ధర తగ్గింపులను ప్రకటించింది. ప్రధానంగా ఐఫోన్ 16, ఐఫోన్ 17ఈ మోడళ్లపై లభిస్తున్న బెస్ట్ డీల్స్ యాపిల్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026- ఐఫోన్ 16 డీల్స్..
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 16 (128జీబీ వేరియంట్) వాస్తవ ధర రూ. 89,900 కాగా, అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 76,999 ప్రారంభ ధరతో లిస్ట్ అయింది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న కొనుగోలుదారులు ప్రాడక్ట్ పేజీలోని రూ. 500 డిస్కౌంట్ కూపన్‌ను అప్లై చేసి ధరను రూ. 72,249 కి తగ్గించుకోవచ్చు!
దీనికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డులు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కూడా వర్తింపజేసుకోవచ్చు:
ఎస్బీఐ కార్డ్ ఆఫర్: అర్హత ఉన్న ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా రూ. 1,250 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ పే క్యాష్‌బ్యాక్: అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా లావాదేవీ పూర్తి చేస్తే గరిష్టంగా రూ. 3,849 వరకు క్యాష్‌బ్యాక్ రూపంలో పొందే అవకాశం ఉంది.
నో-కాస్ట్ ఈఎంఐ: సులభ వాయిదాలలో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 2,161.81 వరకు వడ్డీ మినహాయింపుతో నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026- ఐఫోన 17ఈ డీల్స్..
కొత్త ఫీచర్లతో వచ్చిన లేటెస్ట్ ఐఫోన్ 17ఈ (256జీబీ వేరియంట్) మోడల్ సాధారణంగా రూ. 79,900 ఎంఆర్‌పీ ధరను కలిగి ఉంటుంది. అయితే ఈ పండగ సేల్‌లో ఇది రూ. 71,999 ధరకు లభిస్తోంది. ప్రాడక్ట్ పేజీలో కనిపిస్తున్న రూ. 1,000 అదనపు కూపన్‌ను వర్తింపజేస్తే ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ. 70,999 కి చేరుకుంటుంది.
ఐఫోన్ 17e కొనుగోలుదారులు కూడా అదనపు పొదుపు ప్రయోజనాలను పొందవచ్చు:
ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.
అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా రూ. 1,876.99 వరకు వడ్డీ లబ్ధి పొందుతారు.
అమెజాన్ పే బ్యాలెన్స్ చెల్లింపులపై రూ. 3,599 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
వివిధ కారణాలతో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, యాపిల్ ప్రేమికులకు పాత ఫోన్ల నుంచి కొత్త ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వడానికి లేదా సరికొత్త ఐఫోన్ సిరీస్‌ను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవడానికి ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 మంచి అవకాశంగా నిలుస్తోంది.
మరి మీరు ఏ ఐఫోన్‌ని కొనుగోలు చేస్తున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


