...
...
Next Story

మధుమేహం, ఊబకాయం ఉంటే అమెరికా వీసా రద్దు!

యూఎస్​ వీసా మంజూరుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. వీటి ప్రకారం.. మధుమేహం, ఊబకాయం ఉంటే, దరఖాస్తుదారుడి వీసా అప్లికేషన్​ రద్దు అయ్యే అవకాశం ఉంది!

Published on: Nov 8, 2025, 09:10:11 IST
Advertisement

అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీయులకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం మరో షాక్​ ఇచ్చినట్టు కనిపిస్తోంది! ఇప్పటికే కఠిన రూల్స్​ని తీసుకొచ్చిన ట్రంప్​ యంత్రాంగం.. వీసా దరఖాస్తుదారుడికి మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే, అప్లికేషన్​ని తిరస్కరించే విధంగా ఆదేశాలను జారీ చేసింది.

యూఎస్​ వీసా కొత్త మార్గదర్శకాలు..
యూఎస్​ వీసా కొత్త మార్గదర్శకాలు..

ఈ మార్గదర్శకాలను స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు అమెరికా వనరులను హరించివేసే “పబ్లిక్ ఛార్జ్”గా మారవచ్చని పేర్కొంది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే కేఎఫ్​ఎఫ్​ హెల్త్ న్యూస్ కథనం ప్రకారం.. ఈ మార్గదర్శకాలను అమెరికన్ రాయబార కార్యాలయాలకు, కాన్సులేట్‌లకు ఇప్పటికే పంపించారు.

వీసా దరఖాస్తులో కొత్త వైద్య పరిస్థితులు..

సంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్, టీకా చరిత్ర, అంటు వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితుల తనిఖీ వంటివి వీసా దరఖాస్తు ప్రక్రియలో ఎప్పుడూ భాగంగానే ఉన్నాయి. అయితే, అదనపు వైద్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని ఈ కొత్త మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

నివేదిక ప్రకారం.. "మీరు దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని పరిగణించాలి. గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, డయాబెటిస్, జీవక్రియ వ్యాధులు, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని వైద్య పరిస్థితులకు కొన్ని లక్షల డాలర్ల విలువైన సంరక్షణ అవసరం కావచ్చు," అని కాన్సులేట్​, రాయబార కార్యాలయాలు పంపిన మార్గదర్శకాల్లో ఉన్నాయి.

వీసా అధికారులకు మరో ముఖ్యమైన సూచన కూడా ఇచ్చారు! దరఖాస్తుదారులు వైద్య చికిత్సకు చెల్లించగలరా లేదా అని కూడా అంచనా వేయాలి.

అయితే, వైద్యపరమైన అంశాలపై వీసా అధికారులు సొంత అభిప్రాయాలను జనరేట్​ చేయాలని నిర్దేశించడం ఒక సంక్లిష్టతకు దారితీస్తుందని వీలర్ పేర్కొన్నారు.

"ఇది ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే వారికి వైద్య శిక్షణ లేదు, ఈ విషయంలో వారికి అనుభవం లేదు, వారు తమ సొంత వ్యక్తిగత పరిజ్ఞానం లేదా పక్షపాతం ఆధారంగా అంచనాలు వేయకూడదు," అని ఆయన అన్నారు.

దరఖాస్తులతో పాటు పిల్లలు లేదా వృద్ధ తల్లిదండ్రుల వంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయాలని ఈ మార్గదర్శకాలు వీసా అధికారులను ఆదేశిస్తున్నాయి. "ఆధారపడిన వారిలో ఎవరికైనా వైకల్యాలు, దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు లేదా ప్రత్యేక అవసరాలు ఉండి, వాటి కారణంగా దరఖాస్తుదారుడు ఉద్యోగం కొనసాగించలేకపోతే?" అని కూడా తెలుసుకోవాలని మార్గదర్శకాల్లో ఉంది.

జియోర్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన వలస న్యాయవాది సోఫియా జెనోవీస్, కేఎఫ్​ఎప్​ నివేదిక ప్రకారం, ఈ మార్గదర్శకాలు వీసా అధికారులను దరఖాస్తుదారుల వైద్య చరిత్ర ఆధారంగా వారి వైద్య సంరక్షణ ఖర్చులను, అమెరికాలో ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని ఊహించి అంచనా వేయడానికి ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks