యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2025 (యూపీఎస్సీ ) తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్‌సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించింది. రాజేశ్వరి సువే రెండో స్థానంలో, ఆకాంష్ ధుల్ మూడో స్థానంలో నిలిచారు.

మే 25, 2025న ప్రిలిమ్స్ నిర్వహించగా… ఆగస్టు 2025లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు జరిగిన ఇంటర్వ్యూల ఆధారంగా ఇవాళ తుది మెరిట్ లిస్ట్‌ను యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఫలితాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్లు https://upsc.gov.in/index.php లేదా upsconline.nic.inలో చూడొచ్చు.
UPSC CSE 2025 రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు https://upsconline.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఫైనల్ రిజల్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థుల పేర్లు, రూల్ నెంబర్ తో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసె, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులకు ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే..?
సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు మెరిశారు. సృజన 55వ ర్యాంక్ సాధించగా… డీఎస్‌కే ప్రచేత్ 193వ ర్యాంక్ దక్కించుకున్నారు. ఎస్. వర్షిత్‌రెడ్డి (259వ ర్యాంక్), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297వ ర్యాంక్), వి. విక్రమసింహారెడ్డి (541వ ర్యాంక్), గుమ్మల శ్వేత 573 ర్యాంక్ దక్కించుకున్నారు.
పోతుపురెడ్డి భార్గవ్ 537వ ర్యాంక్ సాధించగా….అనిరుధ్ - 786, శ్రీకర్రాజు -806, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష - 823, ప్రత్యూష - 908, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంక్ సాధించారు.
{{/usCountry}}పోతుపురెడ్డి భార్గవ్ 537వ ర్యాంక్ సాధించగా….అనిరుధ్ - 786, శ్రీకర్రాజు -806, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష - 823, ప్రత్యూష - 908, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంక్ సాధించారు.
{{/usCountry}}