Apple Mac mini, Mac Studio Launch: కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో విడుదల చేసిన ఆపిల్.. ధరలు, ఫీచర్లు ఇవే
యాపిల్ సంస్థ భారత మార్కెట్లోకి అధునాతన ప్రాసెసర్లతో కూడిన 'మ్యాక్ మినీ' (Mac mini), 'మ్యాక్ స్టూడియో' (Mac Studio) సాధనాలను అధికారికంగా విడుదల చేసింది. ఎం6, ఎం5 ఆల్ట్రా వంటి శక్తినంతమైన ప్రాసెసర్ చిప్‌లతో వచ్చిన ఈ డివైజ్‌ల ధరలు, లభ్యత వివరాలు మీకోసం.
భారత మార్కెట్లోకి సరికొత్త డెస్క్‌టాప్‌లను తీసుకొచ్చినట్లు టెక్ దిగ్గజం యాపిల్ మంగళవారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా అధునాతన ఎం6 (M6), ఎం5 ప్రో (M5 Pro) చిప్‌సెట్లతో పనిచేసే మ్యాక్ మినీ, అలాగే ఎం5 మ్యాక్స్ (M5 Max), ఎం5 ఆల్ట్రా (M5 Ultra) చిప్‌లతో నడిచే మ్యాక్ స్టూడియో డెస్క్‌టాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త డివైజ్‌ల రాకతో ఆపిల్ సిలికాన్ పోర్ట్‌ఫోలియోలోకి పవర్ ఫుల్ ప్రాసెసర్లు అయిన M6, M5 Ultra ప్రవేశించాయి.

లేటెస్ట్ ప్రాసెసర్ల పవర్
వినియోగదారులకు అత్యంత వేగవంతమైన పనితీరును అందించేందుకు యాపిల్ ఈసారి నెక్స్ట్-జెన్ చిప్‌సెట్లను ఉపయోగించింది. పవర్-ఎఫిషియెన్సీకి పేరుగాంచిన 'ఎం6' ప్రాసెసర్‌ను మ్యాక్ మినీలో జోడించగా, భారీ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వీడియో ఎడిటింగ్ వర్క్‌ఫ్లోల కోసం 'ఎం5 ఆల్ట్రా' ప్రాసెసర్‌ను మ్యాక్ స్టూడియోలో పొందుపరిచారు. డెవలపర్లు, క్రియోటర్లకు ఇవి మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ సామర్థ్యాన్ని అందిస్తాయి.
ఆపిల్ మ్యాక్ మినీ: ధరల వివరాలు
భారత్‌లో కొత్త మ్యాక్ మిని విక్రయాలు ఎడ్యుకేషన్ ఆఫర్ కింద డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి.
M6 Chip Variant: దీని ప్రారంభ ధర ₹99,990 కాగా, విద్యార్థులు లేదా ఎడ్యుకేషన్ ప్లాన్ కింద ₹89,990 లకే పొందవచ్చు.
M5 Pro Chip Variant: ఈ మోడల్ ధర ₹2,09,900 గా నిర్ణయించారు. ఎడ్యుకేషన్ డిస్కౌంట్ కింద ఇది ₹1,97,900 లకే అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ మ్యాక్ స్టూడియో: ధరల వివరాలు
ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన మ్యాక్ స్టూడియో వేరియంట్లలో ధరలు ఈ విధంగా ఉన్నాయి.
M5 Max Variant: బేస్ మోడల్ ప్రారంభ ధర ₹2,79,900 కాగా, ఎడ్యుకేషన్ ఆఫర్‌లో ₹2,56,900 కి కొనుగోలు చేయవచ్చు.
M5 Ultra Variant: అల్ట్రా హై-ఎండ్ ప్రాసెసర్ కలిగిన ఈ వేరియంట్ ధర ₹6,29,900 గా ఉండగా, ఎడ్యుకేషన్ ప్లాన్ కింద ₹5,84,900 లకే లభిస్తుంది.
ప్రీ-ఆర్డర్లు, లభ్యత
ఈ రెండు పవర్‌ఫుల్ డెస్క్‌టాప్ పరికరాలకు సంబంధించి భారత్‌లో ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాపిల్ స్టోర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి పూర్తిస్థాయి విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ ధ్రువీకరించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


