...
...
Next Story

iPhone 18 : ఐఫోన్ 18 లాంచ్.. ఇప్పట్లో కష్టమే! యాపిల్ వ్యూహంలో కీలక మార్పులు..

iPhone 18 pro : యాపిల్ తన ఐఫోన్ లాంచ్ వ్యూహాన్ని మార్చనుందని తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 18 మోడల్ 2027 ప్రారంభానికి వాయిదా పడే అవకాశం ఉండగా, ఈ ఏడాది చివర్లో ప్రీమియం మోడల్స్ రానున్నాయి. వివరాల్లోకి వెళితే..

Published on: Aug 15, 2026, 10:46:48 IST
Advertisement

టెక్ దిగ్గజం యాపిల్ తన సాంప్రదాయ ఐఫోన్ లాంచ్ ట్రెండ్‌కు స్వస్తి పలకాలని చూస్తున్నట్టు సమాచారం! ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో స్టాండర్డ్, ప్రో మోడల్స్‌ను ఒకేసారి విడుదల చేసే ఆనవాయితీకి ఈసారి తెరపడేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఇదొక అతిపెద్ద మార్పుగా నిలవనుంది.

ఐఫోన్ 18 లాంచ్.. ఇప్పట్లో కష్టమే! (Shaurya Sharma/ HT Photo)
ఐఫోన్ 18 లాంచ్.. ఇప్పట్లో కష్టమే! (Shaurya Sharma/ HT Photo)

తాజా నివేదికల ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ లాంచ్‌లను రెండు విడతలుగా విభజించాలని ప్లాన్ చేస్తోంది. 2026 సెప్టెంబర్​లో అత్యంత ఖరీదైన ప్రీమియం మోడల్స్​ని లాంచ్ చేస్తుండగా, స్టాండర్డ్ ఐఫోన్ 18, ఇతర సరసమైన మోడల్స్ 2027 ప్రారంభంలో అందుకుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.

2027లో రానున్న ఐఫోన్ 18!

సాధారణ ఐఫోన్ 18 విడుదల 2027 మొదటి త్రైమాసికానికి వాయిదా పడే అవకాశం ఉంది. అంటే ఐఫోన్ 17 మోడల్ దాదాపు 18 నెలల పాటు యాపిల్ లేటెస్ట్ స్టాండర్డ్ ఫోన్‌గా మార్కెట్లో కొనసాగుతుంది.

2026 లాంచ్ ఈవెంట్‌లో అత్యంత ఖరీదైన ప్రీమియం మోడళ్లకు యాపిల్ ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల ఆ ప్రీమియం లైనప్‌కు ప్రత్యేక హైప్ వస్తుందని భావిస్తోంది. ఆ తర్వాత 2027 మార్చ్​, ఏప్రిల్ నాటికి స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ, రెండవ తరానికి చెందిన ఐఫోన్ ఎయిర్ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది.

సప్లై చైన్ సమస్యలు కూడా ఈ మార్పునకు కారణం కావచ్చు. చిప్ కొరత కారణంగా యాపిల్ తన హై-మార్జిన్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఏడాది యాపిల్ నుంచి ఏం ఆశించవచ్చు?

యాపిల్ నుంచి రానున్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది పెద్ద ఇంటర్నల్ డిస్‌ప్లే, చిన్న కవర్ స్క్రీన్‌తో వస్తుంది. బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్‌తో శాంసంగ్, ఇతర ఫోల్డబుల్ ఫోన్ తయారీదారులకు యాపిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో సరికొత్త ఏ20 ప్రో చిప్, మరింత మెరుగైన కెమెరా, డిస్‌ప్లే అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. అయితే యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఇవన్నీ లీకులు, నివేదికల ఆధారంగా అంచనా వేసినవే. ఐఫోన్ 18 ప్రో గురించి మరిన్ని వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks